పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా జనవరి 31న మొదలు కాగా, ఫిబ్రవరితో ముగుస్తుంది. రెండవ విడత మార్చి 13న మొదలై ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే దేశాన్ని కుదుపేస్తున్న అదానీ అంశంపై అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. వాయిదాల పర్వంతో ఇరు సభలు నెట్టుకొస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ […]
దేశంలో పెద్ద నోట్ల చలామణి క్రమంగా తగ్గిపోతోంది. నల్లధనాన్ని వెలుగులోకి తేవాలన్నా ఉద్దేశ్యంతో మోదీ సర్కార్ రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటి స్థానంలో రూ. 2,000 నోట్లను తెచ్చినా.. అవి కూడా పెద్దగా కనిపించడంలో లేదు. ఏటీఎంల నుంచి కూడా చాలా అరుదుగా వస్తున్నాయి. దీంతో ఇవి కూడా చెల్లుబాటు కావన్న వదంతులు దేశంలో వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ సరికొత్త డిమాండ్ లేవనెత్తారు. […]
ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ నేత విజయ్ సాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన ఇటీవల రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. తాజాగా విజయ్ సాయిరెడ్డి రాజ్యసభను నడపనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. విజయసాయి రెడ్డి కి అరుదైన ఛాన్స్ లభించింది. తాజాగా ఆయన రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ హోదాలో గురువారం తొలిసారి రాజ్యసభ అధ్యక్ష స్థానంలో ఆశీనులై సభా వ్యవహారాలు నడిపించారు […]
Vijayendra Prasad: ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. విజయేంద్రప్రసాద్ చేత ప్రమాణం చేయించారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రాష్ట్రపతి కోటాలో విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక రాజ్యసభ సభ్యులుగా విజయేంద్రప్రసాద్ 2027 వరకు కొనసాగనున్నారు. అగ్రస్థాయి సినీ రచయిత అయినటువంటి విజయేంద్రప్రసాద్.. పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరులో జన్మించారు. ఆయన కుటుంబంలో అందరికంటే చిన్నవాడు […]
Vijayendra Prasad: తాజాగా పలు రంగాలకు చెందిన ప్రముఖులను రాజ్యసభకు నలుగురిని నానిమేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు మేస్ట్రో ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉష, సామాజికవేత్త వీరేంద్ర హెగ్డే ఉండటం విశేషం. ఈ నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ స్వయంగా ప్రధాని మోదీనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప […]
జూన్ 10న జరగనున్న ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల ఎన్నిక కోసం అన్ని పార్టీల వాళ్లు తమ అభ్యర్థలు ఎంపికను మొదలు పెట్టాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆదివారం 10 అభ్యర్థుల ప్రకటించింది. ఇప్పుడు ఇదే ఆ పార్టీకి పెద్ద తల నొప్పిగా మారింది. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన కొందరు సీనియర్ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాజ్యసభ సీటు ఆశించి..భంగపడిన కాంగ్రెస్ ముంబై […]
ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులను ఎంపిక చేశారు. వీరిలో బీద మస్తాన్ రావు కూడా ఉన్నారు. కొంతకాలం క్రితమే ఆయన […]
Actor Ali: ఆది నుంచి హంసపాదు అన్న చందాన నటుడు అలీ రాజకీయ భవిష్యత్తు సాగుతోంది. వైఎస్సార్ సీపీలో చేరిన నాటినుంచి ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉంది. అలీ ప్రచారాలకు తప్పితే పదవులకు నోచుకోవటం లేదు. ఎన్నికల సమయంలో ఆయనను రాజమండ్రి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఆయనకు సీటు రాలేదు. తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. అది కూడా ప్రచారంగానే మిగిలిపోయింది. గత కొన్ని నెలల నుంచి అలీని […]
Actor Ali: భారత ఎన్నికల సంఘం త్వరలో రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సన్నాహాలు మొదలెట్టాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో తెలంగాణ నుంచి రెండు, ఆంధ్రప్రదేశ్‌నుంచి నాలుగు స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌నుంచి ప్రస్తుతం విజయసాయిరెడ్డి, వై.సుజనా చౌదరి, టి.జి వెంకటేష్, సురేష్ ప్రభులు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. […]
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ‘మ్యాస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే విషయం తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభ సభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువసభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఇప్పుడు ఆయన స్థానంలో ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారని […]