Actor Ali: ఆది నుంచి హంసపాదు అన్న చందాన నటుడు అలీ రాజకీయ భవిష్యత్తు సాగుతోంది. వైఎస్సార్ సీపీలో చేరిన నాటినుంచి ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉంది. అలీ ప్రచారాలకు తప్పితే పదవులకు నోచుకోవటం లేదు. ఎన్నికల సమయంలో ఆయనను రాజమండ్రి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఆయనకు సీటు రాలేదు. తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. అది కూడా ప్రచారంగానే మిగిలిపోయింది. గత కొన్ని నెలల నుంచి అలీని రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. కానీ, అది కూడా ప్రచారంగానే ముగిసింది. ఏపీకి సంబంధించిన నాలుగు రాజ్యసభ స్థానాల అభ్యర్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేసేశారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య, ఏలేటి నిరంజన్‌రెడ్డి పేర్లు ఫైనల్ అయ్యాయి.
సీటు వస్తుందని ఆశించిన అలీకి మొండిచెయ్యి ఎదురైంది. రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో అలీ పేరు లేకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అలీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిలో నేను ఉన్నాను. భవిష్యత్తులో ఏ పదవి ఇచ్చినా భాద్యతగా చేస్తా. నీకు ఫలానా పదవి ఇస్తానని ఆయన ఎప్పుడూ నాకు హామీ ఇవ్వలేదు. ఏదో ఒక పదవి ఇస్తానని గట్టిగా చెప్పారు. నేను ఆ నమ్మకంతోనే ఉన్నా. అందరూ అనుకుంటున్నట్లు వక్ఫ్ బోర్డు పదవి కూడా నాకు ఇవ్వటం లేదు. ఇప్పటికే ఆ పదవి వేరే వాళ్లకు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదో ఒక రోజు పిలుపు వస్తుంది. ఆ రోజు మీడియా ముందుకు వస్తా’’ అని అన్నారు. మరి, అలీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Actor Ali: రాజ్యసభ రేసునుంచి నటుడు అలీ ఔట్!