ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులను ఎంపిక చేశారు. వీరిలో బీద మస్తాన్ రావు కూడా ఉన్నారు. కొంతకాలం క్రితమే ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన కొద్ది రోజలుకే ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వడం పట్ల పలు ఆరోపణలు వస్తున్నాయి. రాజ్య సభ సీటు కోసం ఆయన రూ. 100 కోట్లు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై స్పందిస్తూ.. మస్తాన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
డబ్బులకు రాజ్యసభ సీట్లు దక్కుతాయనుకుంటే… రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు కూడా ఇచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రూ. 100 కోట్లు తీసుకుని ఎంపీ టికెట్ ఇచ్చేలా ఉంటే.. 200 కోట్ల రూపాయలు ఇచ్చేందుకైనా కొందరు అభ్యర్థులు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు డబ్బుతో ఏం అవసరం ఉంది. రూ. 10, 100 కోట్లతోనే గడిచిపోతుందా..’’ అని ప్రశ్నించారు. అంతేకాక ‘‘గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు టికెట్లు ఇచ్చారు. వారి నుంచి ఎంత తీసుకుని టికెట్లు ఇచ్చారు.. ఆర్ కృష్ణయ్య పరిస్థితి అందరికి తెలుసు.. మరి ఆయన ఎంత ఇచ్చాడు’’ అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: TDP కోసం అవసరమైతే చనిపోవడానికైన సిద్ధమే: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
జగన్.. ఆర్ కృష్ణయ్యను ఏపీ తరఫున రాజ్యసభకు ఎంపిక చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో బీసీ నేతలే కరువయ్యారా అని మండిపడుతున్నారు. దీనిపై కూడా మస్తాన్ రావు స్పందించారు. ఆర్. కృష్ణయ్యను తెలంగాణ నేతగా చూడకూడదని.. ఆయన జాతీయస్థాయి బీసీ నేత అన్నారు. బీసీలను అడ్డుపెట్టి ఇద్దరు రెడ్డిలకు రాజ్యసభ ఇచ్చారనడం సరికాదని.. నిరంజన్ రెడ్డి విభజన సమస్యలపై సుప్రీంకోర్టులో రాష్ట్రం తరపున పోరాటం చేస్తున్నారన్నారు. అలాగే అన్న ఓ పార్టీ, తమ్ముడు మరో పార్టీలో ఉండకూడదా.. అయినా బీద రవిచంద్ర తన సొంత తమ్ముడు కాదని మస్తాన్ రావు తెలిపారు. మరి ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Actor Ali: రాజ్యసభకు నో ఛాన్స్.. స్పందించిన నటుడు అలీ!