దేశంలో పెద్ద నోట్ల చలామణి క్రమంగా తగ్గిపోతోంది. నల్లధనాన్ని వెలుగులోకి తేవాలన్నా ఉద్దేశ్యంతో మోదీ సర్కార్ రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటి స్థానంలో రూ. 2,000 నోట్లను తెచ్చినా.. అవి కూడా పెద్దగా కనిపించడంలో లేదు. ఏటీఎంల నుంచి కూడా చాలా అరుదుగా వస్తున్నాయి. దీంతో ఇవి కూడా చెల్లుబాటు కావన్న వదంతులు దేశంలో వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ సరికొత్త డిమాండ్ లేవనెత్తారు. రూ. 2000 నోట్లను రద్దుచేయాలని సూచించారు. రాజ్యసభ వేదికగా ఒక బీజేపీ ఎంపీ ఈ డిమాండ్ చేయడం చర్చకు దారితీస్తోంది.
సోమవారం రాజ్యసభ వేదికగా రూ. 2000 నోట్ల రద్దుకు పట్టుబట్టిన ఎంపీ సుశీల్ కుమార్.. ఈ ప్రక్రియను దశల వారీగా చేపట్టాలన్నారు. చాలా కాలంగా ఏటిఎంలలో రూ. 2000 కనిపించకుండా పోయాయని అన్న ఎంపీ.. ఆర్బీఐ మూడేళ్లుగా రూ. 2000 నోట్లను ముద్రించడం లేదనే విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం నోట్ల రద్దు(డీమానిటైజేషన్) ప్రకటించి నాడు రాత్రికి రాత్రే పాత రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత రూ. 500, రూ. 2000 కొత్త నోట్లను ప్రచురించింది. ‘అసలు రూ. 1000 నోట్లను రద్దు చేసి, రూ. 2000 నోట్లను చలామణిలోకి తేవడంలో ఉన్న మతలబు ఏంటో నాకు అర్థమవ్వడంలేదు..’ అని సుశీల్ కుమార్ మోడీ చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశాలలో సైతం పెద్ద నోట్లు(హయ్యర్ డినామినేషన్ నోట్లు) లేవన్న ఆయన, రూ. 2000 నోట్లను అక్రమంగా దాపెట్టడానికి, మాదకద్రవ్యాలు వంటి అక్రమ వ్యాపారాలు చేయడానికి, మనీ లాండరింగ్‌కు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ‘ప్రస్తుతం దేశంలో ఉన్న కరెన్సీలో హయ్యర్ డినామినేషన్ నోటు.. రూ. 2,000.. అది ఎక్కువ వరకు నల్ల ధనంగా వాడుకునేందుకు ఉపయోగపడుతోంది. ఈ క్రమంలో రద్దు చేయడమే సరైన నిర్ణయం. ప్రభుత్వం దశలవారీగా దీన్ని చేపట్టాలి. వాటిని పౌరులు మార్చుకునేందుకు వీలుగా రెండు సంవత్సరాల గడువు ఇవ్వాలి..’ అని ఎంపీ సుశీల్ కుమార్ మోడీ చెప్పుకొచ్చారు. రూ. 2,000 నోటును రద్దు చేయమనడం.. సరైన నిర్ణయమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BJP MP Sushil Kumar Modi On Lack Of Rs 2000 Currency Notes
Watch: https://t.co/DJKpc5RCN6 | #Indiancurrency #LokSabha #RBI #SushilModi pic.twitter.com/HZaWWjwDUN
— Business Today (@business_today) December 12, 2022