Actor Ali: భారత ఎన్నికల సంఘం త్వరలో రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సన్నాహాలు మొదలెట్టాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో తెలంగాణ నుంచి రెండు, ఆంధ్రప్రదేశ్‌నుంచి నాలుగు స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌నుంచి ప్రస్తుతం విజయసాయిరెడ్డి, వై.సుజనా చౌదరి, టి.జి వెంకటేష్, సురేష్ ప్రభులు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఈ నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పక్రియ పూర్తయినట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, బీసీ నేత ఆర్.కృష్ణయ్యల పేర్లను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
మిగిలిన ఒక్క స్థానంలో కిల్లి కృపారాణి, నిరంజన్ రెడ్డిలలో ఎవర్నో ఒకర్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి రాజ్యసభ సీటు ఆశించిన నటుడు అలీకి మాత్రం మొండిచెయ్యి ఎదురైనట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం జగన్‌ను కలిసిన అనంతరం అలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ త్వరలో మీరు గుడ్‌న్యూస్ వింటారని సీఎం జగన్ చెప్పారు’’ అని అన్నారు. దీంతో అందరూ అలీకి రాజ్యసభ సీటు పక్కా అనుకున్నారు. ఆ తర్వాత కూడా అలీ రెండు సార్లు సీఎం జగన్‌ని కలిశారు.
ఈ నేపథ్యంలో ఆయనకు పెద్ద పదవే దక్కబోతోందన్న ప్రచారం జరిగింది. పార్టీకోసం ఎంతగానో కష్టపడ్డ అలీ కూడా రాజ్యసభపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలతో అలీ కంగుతిన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తనకు సీటు గ్యారంటీ అనుకుంటే ఇలా అయ్యిందేంటా అన్న షాక్‌లో అలీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, రాజ్యసభ ఇవ్వకపోతేనేం.. పార్టీలోనో, ప్రభుత్వంలోనో సుముచిత స్థానాన్ని కల్పిస్తారన్న చర్చ జరుగుతోంది. మరి, రాజ్యసభ రేసునుంచి నటుడు అలీ ఔట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : KTR: బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు!