పెళ్లి అనే రెండు అక్షరాల కార్యక్రమంతో రెండు శరీరాలు ఒకే మనస్సుగా ఏర్పడుతాయి. అందుకే భారతీయ సంప్రదాయంలో పెళ్లికి, భార్యభర్తల బంధానికి ఎంతో విలువ ఉంది. పూర్వకాలం అయితే ఈ బంధం చాలా ధృడంగా ఉండేది. దంపతుల మధ్య ఎంతటి గొడవలు వచ్చిన.. మరుసటి రోజుకు కలిసిపోయి జీవించేవారు. భర్తల సంపాదన గురించి అసలు ప్రశ్నించే వారు కాదు. ఒక వేళ ఏదైన విషయం ఉంటే నాలుగు గోడల మధ్యనే చర్చించుకుంటారు. నేటికాలంలో కాలంలో కూడా ఎక్కువ మంది దంపతులు హాయిగా జీవిస్తున్నారు. కానీ ఓ భార్యకు ఏం అవసరం వచ్చిందో.. తన భర్త సంపాదన గురించి తెలుసుకోవాలని ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ భార్య తీసుకున్న నిర్ణయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
సంజూ గుప్తా అనే మహిళ భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి జీతం కూడా భారీగానే వస్తుంది. అయితే ఎంత వస్తుందనే విషయం మాత్రం సంజూ గుప్తాకు తెలియడం లేదు. ఎన్నిసార్లు అడిగిన భర్త చెప్పడం లేదు. దీంతో సదరు మహిళ తన భర్త జీతం వివరాలు కోరుతూ సమాచారా హక్కు చట్ట కింద దరఖాస్తు చేసుకుంది. అయితే దరఖాస్తును ఆర్టీఐ అధికారులు తిరష్కరించారు. ఆయన అనుమతి లేకుండా ఆదాయ పన్ను శాఖలోని వివరాలు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. వార సమాధానానికి ఆగ్రహం చేందిన సంజు గుప్తా… అంతటితో ఆగలేదు. మరింత కసి పెంచుకుని ఫస్ట్ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించింది. తన భర్త జీతం వివరాలు తెలపాలని అక్కడ కూడా దరఖాస్తు చేసింది. అయితే అనుహ్యంగా అక్కడ కూడా ఆ మహిళ దరఖాస్తు తిరష్కరణకు గురైంది. అయితే ఆ మహిళకు భర్త జీతం తెలుసుకోవాలనే కసి మాత్రం పోలేదు. పట్టువదలని విక్రమార్కుడి లాగా గట్టిగా ప్రయత్నాలు చేసింది.
ఈసారి ఏకంగా కేంద్ర సమాచార సంఘాన్నికే దరఖాస్తు చేసుకుంది. చివరకు ఆమె ప్రయత్నం వృద్ధా పోలేదు. ఎట్టకేలకు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆ మహిళకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకున్న సీఐసీ ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఆమె భర్త జీతంకి సంబంధించిన వివరాలు తెలపాలంటూ ఆదేశాలు జారి చేసింది. అయితే ఇది ఇలా ఉంటే.. భర్త జీతం వివరాల కోసం ఇంతలా పట్టుపడ్డటం, గట్టి ప్రయత్నాలు చేయడం పై స్థానికులు ఆశ్చర్యానికి వ్యక్తం చేశారు. వారి మధ్య ఏమైన ఆర్ధిక విషయాల్లో గొడవలు వచ్చిఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఈమె గట్టిగా ప్రయత్నించి ఉంటే ఐఏఎస్ అయ్యేది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Sanju Gupta filed an RTI application to acquire the details of her husband’s gross and taxable income for two financial years.https://t.co/SwwjXedxZc
— News18.com (@news18dotcom) October 3, 2022