అత్త అనగానే గయ్యాలి, రాక్షసి, మానవత్వం మరిచి కోడలిని వేధింపులకు గురిచేయడం, అధిక కట్నం కోసం పీడించడం అవసరమైతే అంతం చేయడమో ఇవే గుర్తొస్తాయి.. అయితే ఆధునిక కాలంలో అత్తల తీరు మారుతోంది. కోడలిని కుతురులగా చూసే అత్తలు అక్కడక్కడ తారస పడుతున్నారు. ఈ కోవకు చెందిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. కొడుకు చనిపోయినా.. కోడలిని సొంత కుతురిలా చూడడమే కాకుండా ఆమెకు మరో వ్యక్తితో వివాహం జరిపించి తన తల్లి మనసు చాటుకుంది ఓ అత్త.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ సికార్‌లో కమలా దేవి, దిలావర్ దంపతులు, వీరికి శుభమ్ అనే కొడుకు ఉండేవాడు. 2016 లో సునీత అనే అమ్మాయితో శుభమ్ వివాహం జరిగింది. సునీతది పేద కుటుంబం, కాకపోతే గుణం-రూపం రెండూ మంచివే. అందుకే పైసా కట్నం తీసుకోకుండా కోడలిగా స్వీకరించింది కమలా దేవి. చూడముచ్చటైన జంట అని ఊరంతా అంటుండేవారు. దురదృష్టం కొద్దీ ఆరు నెలలకే సునీత భర్త చనిపోయాడు.
ఇది కూడా చదవండి : మహిళలే కిడ్నాప్ చేసి.. గ్యాంగ్ రేప్ చేయించారు
అయితే చిన్నవయసులో భర్త చనిపోయిన సునీతను దూరం చేసుకునేందుకు ఆ దంపతుల మనసు అంగీకరించలేదు. కొడుకు చనిపోతే? కోడలి తప్పేంటని సునీతకు మద్దతు నిలిచింది. పైగా పేదింటి బిడ్డ కావడంతో అమ్మగారింటికి పంపకుండా.. తమతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. సునీతను మంచిగా చదవించి ఉద్యోగం వైపు ఆమెను ప్రొత్సహించింది. ఎంఏ బీఈడీ చదివిన సునీత.. ఈమధ్యే జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించింది.
ఈ మధ్యనే సునీతను ముఖేష్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. సునీత వివాహం చాలా ఘనంగా జరిగింది. ఆ వివాహంలో కాళ్లు కడిగి కన్యాదానం చేసింది కమలాదేవి-దిలావర్ దంపతులే. అంతేకాదు అప్పగింతల సమయంలో వాళ్ల బంధం చూసి.. అత్తమామలు కాదు.. అమ్మానాన్న అనుకున్నారట అంతా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వివాహ వేడుక ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.