భారతదేశ చరిత్రలోనే మెుట్ట మెుదటి సెమీ- హై స్పీడ్ రైళ్లను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ రైళ్ల పేరే వందే భారత్. మేకిన్ ఇండియా భాగంగా అత్యాధునిక సదుపాయలతో, అతి తక్కువ సమయంలో గమ్య స్థానాలను చేరుకునేందుకు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ చాలా మంచిగా ఉపయోగపడాతాయి. ఇప్పటికే 5 వందే భారత్ రైళ్లు ఇండియాలో తిరుగుతున్నాయి. ఇక ఆరవ వందే భారత్ రైల్ ను త్వరలోనే తీసుకురావడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రైల్ ను సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్యలో త్వరలోనే ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. అదే జరిగితే తిరుపతి కి వెళ్లే లక్షల మంది ప్రయాణికుల బాధలకు స్వస్తి పలికినట్లే రైల్వే శాఖ. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అత్యాధునిక సదుపాయాలు, ఆకట్టుకునే అందం, తక్కువ సమయంలోనే గమ్య స్థానాలకు చేర్చుతుంది. గంటకు వేగం 180 కి.మీ ఇవన్నీ వందే భారత్ రైలు కు ఉన్న ప్రత్యేకతలు. దాంతో రాష్ట్రానికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించే రోజులు దగ్గరికి వచ్చాయి. సికింద్రాబాద్-తిరుపతి ల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ను ప్రవేశపెట్టాలని గతంలోనే రైల్వే శాఖను అభ్యర్థించారు పర్యటక, సంస్కృతిక అభివృద్ది శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి. అయితే రోలింగ్ స్టాక్ డిమాండ్ తీర్చడంలో పరిమితులు కారణంగా దీనికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 6వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించాడానికి సిద్దంగా ఉంది. దానిని సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
అయితే సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలును నూతన సంవత్సరంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. ట్రాక్ అప్ గ్రేడేషన్ పూర్తి అయిన తర్వాత అధికారులు తేదిని ప్రకటిస్తారని సమాచారం. ఈ క్రమంలోనే ఈ రైలును సికింద్రాబాద్ – విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు పొడిగించే యోచనలో ఇండియన్ రైల్వే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు గరిష్ట వేగం గంటకు 180 కి.మీ. ఇప్పుడు ఈ స్పీడే ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణంగా మారింది. ఎందుకంటే సికింద్రాబాద్-విజయవాడల మధ్య ఉన్న ట్రాక్ స్పీడ్ సామర్థ్యం గంటకు 130 కి.మీ. దాంతో ఈ ట్రాక్ సామర్థ్యాన్ని 180 కి.మీ పెంచడానికి సమయం పడుతుంది. ఇక ఈ రైలు లో 16 కోచ్ లు ఉండగా.. 1128 సీట్లు ఉంటాయి. ట్రాక్ కు సంబంధించిన మరికొన్ని సమస్యలు కంప్లీట్ చేసిన తర్వాత ప్రధాని మోది చేతుల మీదుగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తారని తెలుస్తోంది.
Vande Bharat Express Passengers Experience #Promo#VandeBharatExpress | #VandeBharat | #ThamaraiTV#NarendraModi | #AmarPrasadReddy | #BJP @narendramodi @PMOIndia @AmitShah @JPNadda @RailMinIndia @GMSRailway @BJP4India @BJP4TamilNadu @annamalai_k @HRajaBJP @amarprasadreddy pic.twitter.com/acOo8GVbYh
— Thamarai TV (@ThamaraiTVTamil) December 5, 2022