పెళ్లయిన వారికి శోభనం రాత్రి ఓ మధురమైన జ్ఞాపకంగా చెబుతారు. నూతన వధూవరులు మనసు విప్పి మాట్లాడుకునేందుకు, ఒకరికి ఒకరు మరింత దగ్గరయ్యేందుకు పెద్దలు దీన్ని ఏర్పాటు చేసినట్లుగా అంటుంటారు. అయితే అలాంటి శోభనం రాత్రి పెళ్లి కొడుక్కి.. పెళ్లికూతురు చుక్కలు చూపించింది.
ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్థం కావడం లేదు. అంతటా మోసం అనేలా తయారైంది పరిస్థితి. నమ్మితే నిండా మోసం చేసేస్తున్నారు. ఇలా నమ్మే మోసపోయాడో పెళ్లికొడుకు. చదువుకున్న అమ్మాయిని వివాహం చేసుకోవాలని కలలు కన్నాడు. చదువుకున్న అమ్మాయి భార్యగా వస్తే పుట్టబోయే పిల్లల్ని బాగా చూసుకుంటుందని భావించాడు. ఈ క్రమంలో తాను అనుకున్న లక్షణాలు ఉన్న ఓ అమ్మాయిని స్నేహితుల సలహా మేరకు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత ఫస్ట నైట్‌కు పెళ్లి కూతురు స్వయంగా భర్తకు హల్వా చేసి పెట్టింది. దీంతో పెళ్లి కొడుకు కుటుంబీకులు తమ కోడల్ని చూసి మురిసిపోయారు.
అదే రోజు రాత్రి శోభనం గదిలోకి వెళ్లిన ఆమె భర్తకు స్వర్గం చూపించింది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి కొత్త పెళ్లి కొడుకు ఒక్కసారిగా బిత్తరపోయాడు. పెళ్లి కూతురు తనకు సినిమా చూపించిందని ఆలస్యంగా తెలుసుకుని షాక్ అయ్యాడు. వరుడి కుటుంబం కూడా షాకైంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా, చికేతా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చికేతా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన నీరజ్ కుమార్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తుంటాడు. అతడికి డబ్బులు, ఆస్తులు బాగానే ఉన్నాయి. చదువుకున్న అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీరజ్ ఆశపడ్డాడు.
నీరజ్ పెళ్లి విషయంలో తన మనసులో ఉన్న కోరికను హరిద్వార్‌లో ఉండే స్నేహితులు సంజయ్, అమిత్‌లకు చెప్పాడు. వాళ్లు తమకు ఓ అమ్మాయి తెలుసంటూ, తను మంచిదంటూ ఆమెను మ్యారేజ్ చేసుకోమని సలహా ఇచ్చారు. నీరజ్ తన ఫ్రెండ్స్ మాటల్ని నమ్మి హరిద్వార్‌లో ఉంటున్న రేఖ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. జనవరి 24న వారి మ్యారేజ్ గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరికీ శోభనం ఏర్పాటు చేశారు. భర్త నీరజ్ కుటుంబానికి భార్య రేఖ ఆ రోజు రాత్రి తన చేతులతో హల్వా తయారు చేసి వడ్డించింది. ప్లాన్ ప్రకారం ముందుగానే అందులో మత్తు మందు కలిపి నీరజ్‌తో సహా కుటుంబ సభ్యులందరికీ తినిపించింది. అదే రోజు ఫస్ట్ నైట్ కావడంతో భర్త నీరజ్‌తో కొంతసేపు ఆమె చనువుగా మెలిగింది.
నీరజ్‌కు రేఖ కాసేపు స్వర్గం చూపించింది. అయితే మత్తు మందు తిన్న నీరజ్ కుమార్ గురకపెట్టి పడుకున్నాడు. పొద్దున లేచి చూసే సరికి రేఖ కనపడలేదు. ఇంట్లోని నగలు, డబ్బు కూడా మాయమయ్యాయి. దీంతో అందరూ బిత్తరపోయారు. రేఖ కోసం హరిద్వార్‌లోని వాళ్ల పేరెంట్స్ ఇంటికి వెళ్లి చూస్తే అప్పటికే వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో రేఖ పెళ్లి డబ్బుల డ్రామా అని తేలిపోయింది. ఈ ఘటన జరిగిన 22 రోజుల తర్వాత నీరజ్ కుమార్ రేఖతో పాటు ఆమె ముఠాపై పోలీసు స్టేషనలో కేసు పెట్టాడు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.