ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న యువతిని అడ్డగించాడో యువకుడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఏదో చేయబోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.
దున్నపోతులా తిని తొంగోడం కాదు, కాస్త పని కూడా చేసి పైసలు సంపాదించాలి అని తండ్రులు సోమరిపోతు కొడుకులను తిడుతూ ఉంటారు. అలా ఎవరైనా తిట్టే వారు ఉంటే ఒకసారి ఈ దున్నపోతును చూడండి. మనసు మార్చుకుంటారు. ఎందుకంటే మిగతా దున్నపోతుల్లా ఎక్కువే తిన్నా ఏడాదికి కోటి రూపాయలు సంపాదించి పెడుతుంది రైతుకి. మరి ఆ దున్నపోతు ఎవరు? దాని చరిత్ర ఏంటి? యజమాని ఎవరు? ఎక్కడిది? మేపడానికి దాని ఖర్చు ఎంత? ఆ వివరాలు మీ కోసం.
దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా అనాదిగా వస్తున్న ఆచారాలు మాత్రం పోవడం లేదు. అందులో ఆడ పిల్లల పెళ్లికి అడ్డంకిగా ఉన్న వరకట్నం ఒకటి. వరకట్నం తీసుకోవడం నేరమని తెలిసినా కూడా.. దీనికి డిమాండ్ తగ్గడం లేదు. పోనీ వరకట్నంతో అత్తింటి వారూ సరిపెడుతున్నారా అంటూ.. అదనపు కట్నం పేరుతో హింసిస్తున్నారు. అయితే అలా అదనపు కట్నం కోసం వేధించిన వరుడి కుటుంబానికి దిమ్మతిరిగే షాక్ నిచ్చింది వధువు కుటుంబం.
దొంగ ఎక్కడైనా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోవడం చూశారా? ఎప్పుడో గానీ ఇలా జరగదు. కానీ ఒక బైక్ దొంగ స్వయంగా పోలీసుల ముందుకొచ్చి లొంగిపోయాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి బాబోయ్ అంటూ పశ్చాత్తాపం చెందుతున్నాడు.
రైతుకి భూమే ఆస్తి. ఉంటే గింటే సొంతంగా ఒక ఇల్లు ఉంటుందేమో. ఎవరైనా తమ ఆస్తులను కాపాడుకుంటారు. ఎందుకంటే ఆ ఆస్తులు ఉంటేనే ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు. లేదంటే విలువే ఇవ్వడం లేదు. అయితే ఒక రైతు మాత్రం తన ఆస్తి మొత్తాన్ని గవర్నర్ కి రాసిచ్చేసి తాను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయాడు. తన భూమిలో ఒక పాఠశాల గానీ ఆసుపత్రి గానీ కట్టించమని చెప్పి కోరాడు. ఇంతకు ఎవరా శ్రీమంతుడు?
పెళ్లయిన వారికి శోభనం రాత్రి ఓ మధురమైన జ్ఞాపకంగా చెబుతారు. నూతన వధూవరులు మనసు విప్పి మాట్లాడుకునేందుకు, ఒకరికి ఒకరు మరింత దగ్గరయ్యేందుకు పెద్దలు దీన్ని ఏర్పాటు చేసినట్లుగా అంటుంటారు. అయితే అలాంటి శోభనం రాత్రి పెళ్లి కొడుక్కి.. పెళ్లికూతురు చుక్కలు చూపించింది.
ఒకప్పుడు పెళ్లంటే.. ఆత్మీయతలు, అనుబంధాలు, విలువలు. కానీ, ఇప్పుడు పెళ్లంటే.. ఆస్తి, కట్నం, అధికారం, అవసరం, మోహం వ్యామోహం. బంధాలకు, అనుభందాలకు విలువ ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. సంతలో పశువులు కొన్నట్లుగా.. ఎంతిస్తావ్ అంటూ మొహమాటం లేకుండా అడుగుతుంటారు. ఇక్కడ కట్నం ముట్టేది వరుడికే.. పెద్దరికం వరుడికే. వాస్తవంగా చెప్పాలంటే.. కట్నం ఇచ్చి కొంటుంది వధువు కనుక.. ఆమెకు అందాలి పెద్దరికం. సమాజంలో అలా ఉండట్లేదు. అందింది చాలదన్నట్లు.. అదనపు కట్నం కోసం వేధించే వారు.. […]