యూపీలో గ్యాంగ్ స్టర్ కుమారుడు అసద్ అహ్మద్, షూటర్ గులామ్ లను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో పట్టపగలు కాల్పులు జరిపి ఉమేష్ పాల్ ని హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. వారు అప్పటినుంచి పరారీలోనే ఉండగా పోలీసులు వారిని తాజాగా ఎన్ కౌంటర్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఎన్ కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఝాన్సీలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్, షూటర్ గులామ్ లను మట్టుపెట్టింది. ఈ ఘటనపై మృతుడు గులామ్ తల్లి స్పందంచారు. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నాయి. కన్న కొడుకని కూడా చూడకుండా అతనికి సరైన శిక్ష పడిందంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శుక్రవారం షూటర్ గులామ్ తల్లి మీడియాతో మాట్లాడారు. “నా కుమారుడు చాలా మంచివాడు కానీ, గత మూడు, నాలుగు నెలలుగా అతను ఎవరితోనే చేరి ఇలాంటి పనులు చేసినట్లు ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నాను. పోలీసులు చేసింది సరైందే. ఈ చర్య గ్యాంగ్ స్టర్లకు, క్రిమినల్స్ కి గుణపాఠం అవుతుంది. అతని శవం కూడా మాకొద్దు. మేము తీసుకోవాలి అనుకోవట్లేదు. అతనికి భార్య ఉంది. ఆమె ఏమైనా తీసుకుంటుందేమో మాకు తెలియదు. మేమైతే తీసుకోము అది మా నిర్ణయం” అంటూ గులామ్ తల్లి వ్యాఖ్యానించారు.
Former MP-Atiq Ahmed’s son Asad and his aide killed in an encounter by UP Police in Jhansi
The two were wanted in the Umesh Pal murder case pic.twitter.com/FEBHQw6NVn
— ANI (@ANI) April 13, 2023
గులామ్ ఎన్ కౌంటర్ ఘటనపై అతని సోదరుడు కూడా స్పందించాడు. “అతడిని పోలీసులు నిరంతరం వెతుకుతున్నారనే విషయం మాకు తెలుసు. మా దగ్గర ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందజేశాం. మాకు కూడా ఎన్ కౌంటర్ గురించి తెలిసింది. అతను కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధాలను తెంచుకున్నాడు. అతని మృతదేహాన్ని మేము తీసుకోవాలి అనుకోవట్లేదు” అంటూ సోదరుడు చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరిలో యూపీలో ఉమేష్ పాల్ ని పట్టపగలు కాల్చి చంపిన కేసులో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్, షూటర్ గులామ్ నిందితులుగా ఉన్నారు. వాళ్లు ఘటన తర్వాతి నుంచి పరారీలోనే ఉన్నారు. పోలీసులు తాజాగా వారిని ఎన్ కౌంటర్ లో హతమార్చారు.
#WATCH | Prayagraj, UP: “The action taken by the government is absolutely correct. All gangsters and criminals will take a lesson from this. I had no idea that he (my son) used to work for gangster Atiq Ahmed. I will not receive his body, maybe his wife will receive it,” says… pic.twitter.com/9oqwnwYd2i
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 14, 2023