రాజస్థాన్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీ కొనడం వల్ల పెను ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఎదురెదురుగా డీ కొట్టడంతో భారీగా ఎత్తున మంటలు చెలరేగాయి. చెలరేగిన మంటల్లో ట్రక్కుల డ్రైవర్లు ఇద్దరు సజీవదహనం అయ్యారు.
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం పోలీసులు అక్కడక్కడ అవగాహనా కార్యక్రమాలు పెడుతూనే ఉంటారు. ఎన్ని నిబంధనలు పెట్టినా వాటిని పట్టీపట్టనట్లు కొందరు వ్యవహరిస్తారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే చాలావరకు ప్రమాదాలను నివారించవచ్చు. హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాలు చాలా వరకు ట్రక్కు, లారీ డ్రైవర్లు నిద్రమత్తులో చేసిన తప్పిదాలే ఎక్కువ. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్లు ఇతర రాష్ట్రాల నుండి రాత్రిపగలు జర్నీ చేస్తారు కాబట్టి వారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. అతి వేగం వల్ల కూడా లారీ, ట్రక్కు డ్రైవర్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.అలాంటి సంఘటనే ఇప్పడు మనం చెప్పుకోబోయేది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీ కొనడం వల్ల పెను ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఎదురెదురుగా డీ కొట్టడంతో భారీగా ఎత్తున మంటలు చెలరేగాయి. చెలరేగిన మంటల్లో ట్రక్కుల డ్రైవర్లు ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ భిల్వాఢా జిల్లా గులాబ్‌పురాలోని జాతీయ రహదారి 79పై జరిగింది.
స్థానికులచే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు ఎగిసిపడుతున్న కారణంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశాక ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఓ ట్రక్కులోని డ్రైవర్ నిద్రమత్తులో ట్రక్కు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. నిద్రమత్తులో రాంగ్ రూట్‌లోకి ట్రక్కును తీసుకెళ్లడం వల్ల ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇద్దరు డ్రైవర్లు చనిపోయినట్లు గుర్తించారు. ట్రక్కులో ఎంత మంది ఉన్నారనే వివరాలు తెలియరాలేదని గులాబ్‌పురా పోలీస్‌స్టేషన్ ఇంచార్జీ గజరాజ్ చౌదరీ చెప్పారు.