విద్య, వైద్యం ఈ రెండూ ఉచితంగా అందించిన నాడే.. ఈ దేశం అభివృద్ధి చెందినట్టు. చదువు అందరికీ అందకపోతే సమాజానికి వెలుగును చూపించే ప్రతిభావంతులు చీకట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అలానే వైద్యం అందరికీ అందకపోతే వెనకబడినట్టే అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ప్రాణం అనేది వెల కట్టలేనిది. మనిషిని బతికించగలిగే అవకాశం ఉండి కూడా బతికించే ప్రయత్నం చేయకపోతే ఈ సాంకేతికత, అభివృద్ధి ఇవన్నీ ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా వృధానే. పల్లెటూర్లలోకి స్మార్ట్ ఫోన్ వెళ్లినంతగా అంబులెన్స్ లు వెళ్లలేకపోతున్నాయి. మనుషులకు అత్యంత ఉపయోగం లేని ఫోన్లే రిమోట్ ఏరియాస్ కి వెళ్తున్నప్పుడు.. ప్రాణాలు కాపాడడానికి ఒక్క అంబులెన్స్ వెళ్లకపోతే ఈ దేశం అభివృద్ధి చెందిందని ఎలా అనగలుగుతాం.
అంతరిక్షంలోకి రాకెట్లు వెళ్తాయి.. కానీ మన పక్కనే ఉన్న రిమోట్ ఏరియాస్ కి మాత్రం అంబులెన్స్ లు వెళ్లవు. అంతరిక్షంలోకి రాకెట్లు వెళ్లినంత ఈజీగా రిమోట్ ఏరియాల్లోకి అంబులెన్స్ లు వెళ్లడం లేదు. ప్రయోగాలకి ఇచ్చే విలువ ప్రాణాలకు ఇవ్వకపోవడమే ఆశ్చర్యం. ప్రయోగాలు చేయడం తప్పు కాదు, అంతరిక్షంలోకి రాకెట్లను పంపించమూ తప్పు కాదు. కానీ వీటితో పాటు రిమోట్ ఏరియాస్ కి అంబులెన్స్ లు పంపిస్తే ప్రాణాలు కాపాడిన వాళ్లమవుతాం. ఇంకా ఈ దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న మనుషులు మంచి నీళ్ల కోసం కిలోమీటర్లు నడుచుకుంటూ ఎక్కడికో వెళ్లి తెచ్చుకుంటున్నారు. రోగాంవ్ వస్తే కిలోమీటర్లు పరుగులు పెడుతున్నారు.
ఊళ్ళో డాక్టర్ ఉండడు. మంచి స్కూల్ ఉండదు, మంచి నీళ్లు ఉండవు. గట్టిగా చెప్తే మంచి బతుకే ఉండదు. మంచి అనేది పక్కన పెడితే అసలు బతుకే ఉండదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకెక్కడైనా ఉంటుందా? ఎందుకిలా జరుగుతుంది? ఇప్పటికీ ఏ అనారోగ్యం వచ్చినా సైకిల్ మీదనో, భుజాన మోసుకునో రోగులని ఆసుపత్రికి తీసుకురావాల్సిన దుస్థితి. ఈ ఘటన ఝార్ఖండ్ లో చోటు చేసుకుంది. ఝార్ఖండ్ సమీపంలో ఉన్న ఒక గ్రామంలో అంబులెన్స్ సదుపాయం లేక.. ఇద్దరు వ్యక్తులు తమ ఒక రోగిని మంచం మీద 5 కిలోమీటర్లు మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మంచాన్ని అంబులెన్స్ గా మార్చి ఇద్దరు వ్యక్తులు ఇలా మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోగులను ఇలా మంచాల మీద ఆసుపత్రికి మోసుకుంటూ తీసుకెళ్లడం ఝార్ఖండ్ లో మామూలే అని స్థానికులు చెబుతున్నారు. సూపర్బ్.. మనుషులుగా మనం సక్సెస్ అయినట్టే. గ్రామాలకి ఫోన్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, టీవీ వచ్చింది, టీవీ కనెక్షన్ వచ్చింది. ఇలా అనవసరమైనవన్నీ వచ్చాయి కానీ ప్రాణాలు కాపాడే హాస్పిటల్ గానీ, హాస్పిటల్ కి తీసుకెళ్లే అంబులెన్స్ గానీ రావు. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఏ మనిషికైనా అనిపించేది ఏంటంటే.. ప్రతీ గ్రామానికి ఊరి చివర ఒక 10 అంబులెన్స్ లు అలా ఉండాలి. కనీసం ఒకటైనా ఉండాలి. గ్రామానికి కాకపోయినా మండలానికి ఒక అంబులెన్స్ అయినా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇలాంటివే జనాలు ఈ నాయకులని అడగాలి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది. దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
झारखंड : 5 किलोमीटर कंधे पर खाट ढोकर अस्पताल पहुंचा मरीज#ViralVideo pic.twitter.com/lozqtnffCJ
— News24 (@news24tvchannel) December 10, 2022