దేశ వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం.. అతి వేగం ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎన్నిసార్లు జరిమానాలు విధించినా.. జైలుకు పంపినా వీరిలో మాత్రం మార్పు రావడం లేదని ట్రాఫిక్ పోలీసులు.
ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు. కుటుంబ పెద్దలను పోగొట్టుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ ప్రమాదాలు ఎక్కువగా డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎన్ని చేపట్టినా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
హర్యానా అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం అంబాలా వద్ద యమునా నగర్ – పంచకుల జాతీయ రహదారిపై ఓ బస్సును ట్రక్కు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో బస్సులు నుజ్జు నుజ్జు అయ్యింది.. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు మొదలు పెట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. హెవీ లోడ్ తో ఉన్న ట్రైలర్ ట్రక్ బస్సును వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది. ఆ సమయంలో ట్రక్కు పూర్తిగా బస్సు మీదకు దూసుకు వెళ్లినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది.. ప్రమాదం తీవ్రత చూస్తే చాలా ఘోరంగా ఉందని అన్నారు. ట్రైలర్ ట్రక్ బస్సును గుద్ది పక్కకు తిరిగిపోయి.. రాంగ్ సైడ్ లో బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో ఇరు వాహనాల డ్రైవర్లు ప్రాణాలతో తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.