మన దేశంలోని కోర్టులు అనేక తీర్పులు ఇస్తుంటాయి. కొన్ని తీర్పులు అయితే ఎవరు ఊహించన విధంగా వెలువడుతుంటాయి. ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు మొదలుకొని క్రింది స్థాయి కోర్టుల వరకు అన్ని అనేేక సంచలన తీర్పులు ఇచ్చాయి. తాజాగా బాంబే హైకోర్టు ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భర్తను తిరుగుబోతు, తాగుబోతు అంటూ భార్య ఆరోపించడం క్రూరత్వమే అవుతుందని బాంబే కోర్టు పేర్కొంది. ఓ భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేస్తూ గతంలో క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ తాజాగా బాంబే హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రంలోని ముంబైలో ఓ ప్రాంతంలో ఉండే రిటైర్డ్ ఆర్మీ అధికారి దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ 2005 నవంబర్ లో పూణె ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. అలానే ఆ దంపతుల ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది. అయితే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆర్మీ అధికారి భార్య బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సదరు మహిళ వేసిన పిటిషన్ కోర్టులో విచారణలో ఉండగా ప్రతివాదిగా ఉన్న ఆర్మీ అధికారి మరణించాడు. దీంతో అతని చట్టపరమైన వారసుడిని ప్రతివాదిగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. అయితే మహిళ.. హైకోర్టు సమర్పించిన పిటిషన్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు ఇతర స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని, ఆయన మద్యం సేవించేవాడని పేర్కొంది.
ఈ చెడు అలవాట్ల కారణంగా తన వైవాహిక జీవితం సజావుగా సాగలేదని, తనకు అందాల్సిన భరణం కూడా దక్కలేదని ఆమె ఆరోపించింది. దీనిపై జస్టిస్ నితిన్ జామార్ద్, షర్మిలా దేశ్ ముఖ్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఈ డివిజన్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. ఎటువంటి ఆధారాలు లేకుండా భర్తపై అసత్య ఆరోపణలు చేయడం వల్ల సమాజంలో అతని పరువు మర్యాదలకు భంగం కలిగించినట్లే అవుతుందని, ఇది క్రూరత్వంతో సమానమని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. సదరు మహిళ చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. అలానే ఆ దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ క్రింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్ధించింది.
Wife labelling husband as ‘womaniser’, ‘alcoholic’ in court without evidence amounts to cruelty: Bombay High Court
report by @satyendra_w https://t.co/vQ3gpU6ia7
— Bar & Bench (@barandbench) October 25, 2022