ఈ మద్య దొంగలు రక రకాల పద్దతుల్లో దోచుకుంటున్నారు. ఒంటరిగా కనిపించే ఆడవారిని టార్గెట్ చేసుకొని వారిపై దాడులు చేసి ఒంటిపై ఉన్న బంగారం ఎత్తుకెళ్తున్నారు. మరికొంత మంది దొంగలు ఇంట్లో చొరబడి దోచుకుంటున్నారు.. అడ్డు వచ్చినవారిని చంపేస్తున్నారు. అయితే కొంత మంది దొంగలు మాత్రం దోచుకెళ్లిన సొత్తు తిరిగి వారికి ఇవ్వడమే కాదు.. క్షమాపణలు కూడా కోరుతున్నారు. దేవాలయాల్లో దొంగతనాలు చేసిన వారు తిరిగి ఆ సొమ్ము గుడిలో ఉంచి వెళ్లిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ దొంగ తాను ఎత్తుకెళ్లిన సొమ్ము మొత్తం అదే ఇంటికి పార్సిల్ చేసి మరీ పంపించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.
ఘజియాబాద్ లో ఒక ఉపాధ్యాయుడు కుటుంబం పనిపై వేరే ఊరు వెళ్లారు. కొన్నిరోజులు ఆ ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఓ దొంగ ఇంట్లో దూరి నగలు, కొన్ని సామాన్లు ఎత్తుకెళ్లాడు. ఆ ఉపాధ్యాయుడు తిరిగి వచ్చి చూసేవరకు ఇల్లంతా గందరగోళంగా మారింది. ఇంట్లో వస్తువులు చెల్లా చెదురుగా పడిఉన్నాయి. బీరువాలో కొంత డబ్బు, నగలు మాయం అయ్యాయి. తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టు పక్కల సీసీ టీవీ ఫుటేజ్ లు పరిశీలించారు. ఓ వ్యక్తి బ్యాగ్ తో టీచర్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి.
పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో అక్టోబర్ 31 న ఉపాధ్యాయుడి ఇంటికి ఒక కొరియర్ వచ్చింది. ఆ కొరియర్ చూడగానే మొదట టీచర్ కుటుంబ సభ్యులు భయపడ్డారు. ఆ పార్సిల్ తీసుకు వెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అంతా పరిశీలించి పార్సిల్ ని విప్పారు. అంతే ఉపాధ్యాయుడి కుటుంబం ఒక్కసారే షాక్ తిన్నారు. ఆ పార్సిల్ లో తమ ఇంట్లో దొంగిలించబడిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ.5 లక్షలు. అయితే దొంగతనం చేసిన ఆ వ్యక్తి ఏదో కారణంగా ఆ టీచర్ ఇంటికి తిరిగి పార్సిల్ చేసి పంపించినట్లు పోలీసులకు అర్ధం అయ్యింది. ఇదిలా ఉంటే ఆ దొంగ తమ ఇంట్లో రూ.20 లక్షల విలువ గల ఆభరణాలు, వస్తువులు ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు.
UP के जिला गाजियाबाद में चोरों ने एक फ्लैट से जेवरात चुराए। चार दिन बाद कोरियर से पार्सल भेजकर कुछ जेवरात लौटा भी दिए। #Ghaziabad
Report – https://t.co/g96SEm9G1U pic.twitter.com/m665WbVMTB
— Sachin Gupta (@Sachingupta788) November 1, 2022