ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెలవులను ప్రకటించింది. ఢిల్లీలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ జనవరి 1 నుంచి 15 వరకు విద్యార్ధులకు శీతాకాలపు సెలవులను ప్రకటించింది. అయితే ఈ సెలవులు ప్రైమరీ, ప్రీ ప్రైమరీ స్కూళ్లకు మాత్రమే వర్తిస్తాయని విద్యా శాఖ అధికారులు తెలిపారు.
దీంతో జనవరి 1 నుంచి 15 వరకు ఢిల్లీలోని పాఠశాలలు పూర్తిగా మూతపడనున్నాయి. కాగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, విపరీతమైన చలి పెరిగిపోవడంతో ఈ కారణంగా విద్యార్థులు చలికి తట్టుకోలేరు అని భావించిన కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యార్థులకు 15 రోజుల పాటు సెలవులను ప్రకటిస్తు నిర్ణయం తీసుకుంది.