నిత్యం రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటూ.. బీజేపీపై విమర్శలు కురిపిస్తూ ఉండే రాహుల్ గాంధీ.. తాజాగా ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ స్వరా భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా నటిగా కన్నా కూడా వివాదాల వల్ల బాగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈమె మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంటుంది. వివాదాల సంగతి పక్కన పెడితే… తాజాగా తన పెళ్లి వార్త చెప్పి అందరికి షాక్ ఇచ్చింది స్వరా భాస్కర్. ఈమె వివాహం కూడా విపరీతంగా ట్రోల్ అయ్యింది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వేరే మతం వ్యక్తిని వివాహం చేసుకోవడమే కాక.. గతంలో అన్న అని పిలిచిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో.. నెటిజనులు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. సమాజ్ వాది పార్టీకి చెందిన నేత ఫాహద్ జిరార్ అహ్మద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2020లో సమాజ్ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఫాహద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. మొదట్లో ఆమె అతడ్ని ‘అన్నయ్య’ అని పిలిచేది.
ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం మొదలై.. అది కాస్త ప్రేమగా మారింది. 2020 నుంచి ప్రేమలో ఉన్న వీరు.. ఇరు కుటుంబాల అంగీకారంతో.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత తమ పెళ్లి విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు స్వరా భాస్కర్. జనవరిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వీరు.. తాజాగా సంప్రదాయ పద్దతిలో మరో సారి వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు స్వరా-ఫహద్ దంపతులు. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు.. ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇక రిసెప్షన్ వేడుకలో స్వర, ఫహద్‌ల జోడీ చాలా అందంగా కనిపించింది. స్వర భాస్కర్ పింక్ లెహంగా ధరించగా, ఫహద్ అహ్మద్ ఆఫ్ వైట్ షేర్వానీలో అందంగా కనిపించారు. ప్రస్తుతం వీరి పెళ్లి వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక రిసెప్షన్ పార్టీలో స్వర-ఫహద్ ఇద్దరూ ఒకరికొకరు హగ్ చేసుకుని.. ఫొటోలకు రొమాంటిక్ పోజులిచ్చారు. అంతేకాక అతిథుల ముందే స్వర భాస్కర్‌ను ముద్దాడి తన ప్రేమను చాటుకున్నాడు ఫహద్. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ, సంగీత్, మెహందీ, ఖవ్వాలీ నైట్ ఈవెంట్లు వేడుకగా నిర్వహించారు. ఇక తాజాగా ఎంతో ఘనంగా రిసెప్షన్ వేడుక ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అభిమానులు, పార్టీ కార్యకర్తలు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.