దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. కాలేజీలో ఫ్రెండ్స్, ఆఫీసుల్లో ఉద్యోగులు.. ఇలా అందరూ ఈ పండగను ఆనందంగా జరుపుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పండుగలో భాగంగా ఓ యువకుడు ఏకంగా డ్యూటీలో ఉన్న పోలీసులకు రంగు పూశాడు.
హోలీ పండగను దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. కాలేజీలో ఫ్రెండ్స్, ఆఫీసుల్లో ఉద్యోగులు.. ఇలా అందరూ ఈ పండగను ఆనందంగా జరుపుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పండుగలో భాగంగా ఓ యువకుడు ఏకంగా డ్యూటీలో ఉన్న పోలీసులకు రంగు పూశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన పోలీసులు ఆ యువకుడితో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా అతనిపై దాడి కూడా చేశారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అయితే ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు..!
దేశ వ్యాప్తంగా హోలీ పండుగను అందరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగానే ఉత్తర్ ప్రదేశ్ మధుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కూడా తన స్నేహితులతో ఉత్సాహంగా జరుపుకున్నాడు. అంతేకాకుండా ఈ యువకుడు.. డ్యూటీలో ఉన్న పోలీసులకు సైతం తన చేతులో ఉన్న రంగు పూశాడు. దీనిపై కోపంతో ఊగిపోయిన పోలీసులు ఆ యువకుడితో వాగ్వాదానికి దిగారు. అతడు పోలీసులను మాటకు మాట అనడంతో కోపంతో ఊగిపోయిన పోలీసులు ఆ యువకుడిని నడి రోడ్డుపై చితక్కొట్టారు. ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు.
ఇక అదే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ ఒక్కోరు ఒకోలా స్పందిస్తున్నారు. రంగు పూస్తే కొడతారా అని కొందరు అంటుంటే.., డ్యూటీలో ఉన్న పోలీసులకు రంగు పూయడమేంటి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏదేమైన డ్యూటీలో ఉన్న పోలీసులకు యువకుడు రంగు పూయడం ఎంత వరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 9, 2023