ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అయితే మీడియా సమావేశం అనంతరం ఓ వ్యక్తి.. క్రైస్తవ ఆస్తులకు సంబంధించి కేఏ పాల్ ను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రజాశాంతి పార్టీ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఫుల్ యాక్టీవ్ గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఘటనలపై కేఏ పాల్ నిత్యం స్పందిస్తూ వార్తలో నిలుస్తారు. మునుగోడు ఎన్నికల సమయంలో తనదైన శైలిలో ప్రచారం చేసి అందరిని ఆకట్టుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల ఆస్తులు దొచుకుంటుందంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటారు. అలానే ఇటీవలే ఏపీలో జరిగిన తొక్కిసలాట ఘటనలపై కేఏ పాల్ స్పందించిన తీరు అందరిని ఆకట్టుకుంది. తరచూ మీడియా ముందుకు వచ్చి తెలుగు రాష్ట్రాల సమస్యలపై మాట్లాడుతుంటారు. మీడియాతో మాట్లాడే సమయంలో కొన్ని సార్లు ఆయనకు వింత అనుభవాలు ఎదరవుతుంటాయి. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సమయంలో ఓ వింత అనుభవం ఎదురైంది. కేఏ పాల్ ను ఓ వ్యక్తి మీడియా సాక్షిగా నిలదీశాడు. వారిద్దరి మధ్యకాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
శుక్రవారం కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై.. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అంశాలపై కేఏ పాల్ మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన అనంతరం కేఏ పాల్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేఏ పాల్ ను ఓ వ్యక్తి నిలదీశాడు. క్రైస్తవుల ఆస్తులు కొట్టేస్తున్నారు.. వాటి గురించి మాట్లాడండి అంటూ సదరు వ్యక్తి కేఏ పాల్ ను ప్రశ్నించాడు. తాను హిందువుగా పుట్టిన.. క్రిస్టియన్ ఫాలోవర్‌నని కేఏ పాల్ సమాధానం ఇచ్చారు. మరి.. అలా అయితే పాల్ అని పేరు ఎందుకు పెట్టుకున్నారని ఆ వ్యక్తి నిలదీశాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
నీకు మర్యాదలు తెలిసి ఉంటే.. ఇలాంటి అనవసరమైన మాటలు ఆపండంటూ కేఏ పాల్ సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఏ పాల్ మాట్లాడుతూ.. “ఈ వ్యక్తి కేవలం క్రైస్తవుల ఆస్తుల గురించి మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ వాళ్లు ఏకంగా కామారెడ్డి జిల్లా రైతుల ఆస్తులు ఎత్తుకెళ్లారు. తెలంగాణ ప్రజలందరి ఆస్తులను కేసీఆర్ ఎత్తుకెళ్తున్నాడు. ఈ వ్యక్తి ఏదైన ఉంటే నాకు ఓ అప్లికేషన్ లాగా ఇవ్వాలి కదా? దానిని నేను స్టడీ చేసి సమాధానం చెప్తాను. ఇతడు కావాల్సి మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు” అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.