వారిద్దరూ చిన్న నాటి నుండి స్నేహితులు, ఆ త్వరాత స్నేహం ప్రేమగా మారింది. ఆ ఇద్దరిదీ ఒకే ఊరు అయినప్పటికీ కులాలు వేరు. ఇదే వారి పెళ్లికి అడ్డుగోడగా మారింది. కానీ ఆరేళ్ల ప్రేమను చంపుకోలేక.. ఇద్దరు ఇంట్లో నుండి పారిపోయి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. అమ్మాయిని అతడి ఇంటికి తీసుకెళ్లాడు. తమ అమ్మాయి కనిపించడం లేదని భావించిన ఆమె తల్లిదండ్రులు, విషయం తెలిసి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులతో మాట్లాడాలంటూ వచ్చి.. కూతుర్ని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే జిల్లాలోని ఇలంచి గ్రామంలో వినీత్ కుటుంబం నివసిస్తోంది. గుజరాత్ కు చెందిన నవీన్ పటేల్ గత 20 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివసిస్తూ కలప దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి కుమార్తె కృతిక, వినీత్ చదువుకునే రోజుల నుండి ప్రేమించుకుంటున్నారు. గత ఏడాది చదువు పూర్తి చేసిన వినీత్.. చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరీ కులాలు వేర్వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకోరని భావించిన ఆ ఇద్దరూ ఇంట్లో నుండి పరారై.. గత ఏడాది డిసెంబర్ 27న కన్యాకుమారిలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.
అయితే తమకు.. పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యుల నుండి ప్రాణ హాని ఉందంటూ వినీత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో తమ కుమార్తె కనిపించడం లేదంటూ కృతిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నివ్వడంతో.. ఈ నెల 4 వ తేదీన పిలిచి విచారించగా.. తాను తన భర్తతోనే ఉంటానని తెగేసి చెప్పింది. తమ కూతురికి, తమకు ఎలాంటి సంబంధం లేదని అక్కడి నుండి వెళ్లిపోయిన తల్లిదండ్రులు వినీత్ ను బెదిరించడం మొదలు పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి వినీత్ పిటిషన్ పెట్టుకున్నారు. దీంతో గురువారం విచారణ కోసం ఇరు కుటుంబ సభ్యులను పిలిపించారు.
పోలీస్ స్టేషన్ విచారణకు వినీత్-కృతికతో పాటు అతని కుటుంబ సభ్యులు వేచి చూశారు. ఎంతకూ కృతిక తల్లిదండ్రులు రాకపోవడంతో భోజనం చేసి రావాలని పోలీసులు సూచించారు. అయితే కారులో ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో కాపుకాచిన కృతిక తల్లిదండ్రులు..తమ బంధువుల ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి, అనంతరం ఒక్కసారిగా వినీత్ కుటుంబంపై దాడి చేశారు. ఆ తర్వాత కుమార్తెను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలు సిసిటివి ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఈ కిడ్నాప్ ఘటనపై కృతిక తండ్రితో సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు స్పెషల్ ఫోర్సులను రంగంలోకి దింపారు.
மாற்று சமூகத்தை சேர்ந்தவரை திருமணம் செய்த பெண்ணை, கணவன் கண்முன்னேயே தூக்கிச் சென்ற பெண் வீட்டார் #Tenkasi | #lovemarriage | #InterCasteMarriage | #CCTV pic.twitter.com/StuHv6su14
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) January 26, 2023