ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద గత నెల రెండో తేదీన 12841 షాలీమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నల్ అని రైల్వే భద్రత కమీషనర్ దర్యాప్తు నివేదికలో పేర్కొంది. దీంతోపాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని కూడా తెలియజేసింది.
ఇటీవల ఒడిశాలో గత నెల రెండో తేదీన జరిగిన రైలు ప్రమాదం భారతదేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలో ఘోర రైల్వే ప్రమాదం చోటుచేసుకుంది. ఇది ఇండియన్ రైల్వే హిస్టరీలోనే అత్యంత భారీ ప్రమాదాల్లో ఒకటి. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ఈ దుర్ఘటనలో కొన్ని వందల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనపై పలు అనుమానాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ‘రైల్వే భద్రత కమిషనర్’ దర్యాప్తు నివేదిక ప్రకారం ఈ ఘోర రైలు ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నలే అని తెలిపింది. ఈ ప్రమాదాలను అధిగమించడానికి రైల్వే భద్రత కమిషనర్ తీసుకోవలసిన చర్యల గురించి తెలిపింది.
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద గత నెల రెండో తేదీన 12841 షాలీమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నల్ అని రైల్వే భద్రత కమీషనర్ దర్యాప్తు నివేదికలో పేర్కొంది. దీంతోపాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని కూడా తెలియజేసింది. ప్రమాదానికి గల కారణాలను నివేదికలో వెల్లడించింది. తప్పుడు వైరింగ్, తప్పుడు కేబుల్ అనుసంధానం వల్ల కోరమాండల్ ప్రమాదం జరిగిందని తెలిపింది. సిగ్నలింగ్, సర్క్యూట్ మార్పులో లోపాలు కూడా కారణమని తెలిపింది.
సీఆర్ఎస్ నివేదికలోని అంశాలు:
సిగ్నల్ వ్యవస్థలో లోపాలున్నాయని.. రెండు ఈక్వల్ రూట్స్‌ను అనుసంధానించే స్విచ్‌లు చాలాసార్లు పనిచేయలేదని బహానగాబజార్ స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. సిగ్నల్ -టెలికాం సిబ్బంది తగిన చర్యలు తీసుకోలేదు. బహానగాబజార్ స్టేషన్ సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేట్ 94 దగ్గర ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బ్యారియర్ ను మార్చే పనుల ఆమోదానికి నిర్దిష్ట సర్క్యూట్ డయాగ్రమ్‌ను సరఫరా చేయలేదు. దానివల్లనే తప్పుడు వైరింగ్ జరిగినట్లు.. కొందరు పర్యవేక్షకులు వైరింగ్ డయాగ్రమ్‌ను మార్చినా దానిని అమలు చేయలేదు. ఇటువంటి ప్రమాదాలు జరిగిన సమయంలో వెంటనే స్పందించేలా అధికారులు ఉండాలి.
విపత్తు యాజమాన్య బృందాలకు మధ్య సమన్వయం ఉండాలి. ఉత్తర సిగ్నల్ గూమ్టీ దగ్గర గతంలో జరిగిన సిగ్నలింగ్‌లో ప్రమాదం వల్లనే గూడ్స్ రైలును వెనకవైపు నుండి కోరమాండల్ ఢీకొట్టింది. సిగ్నల్ వైరింగ్ ఫొటోలను, ఇతర డాక్యుమెంట్లను, సర్క్యూట్లను అప్‌డేట్ చేయాలి. సిగ్నల్ ఆధునికీకరణ పనులు చేపట్టడానికి ప్రామాణికమైన నిర్వహణను చేపట్టాలి. మార్పులు చేసిన సిగ్నల్ సర్క్యూట్ల పనిచేసే విధానాన్ని పరీక్షించి, మార్గాన్ని పునరుద్ధరించేటప్పుడు తనిఖీ చేయడానికి స్పెషల్ టీమ్‌ని అపాయింట్ చేయాలి.