ఇటీవల జరిగిన ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ ఘటన దేశవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలసిందే. అయితే ఈ ఘటన తరహాలో రెండు రైళ్లను ఢీకొనేలా చేస్తామని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బెదిరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు లేఖ రాశారు.
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద గత నెల రెండో తేదీన 12841 షాలీమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నల్ అని రైల్వే భద్రత కమీషనర్ దర్యాప్తు నివేదికలో పేర్కొంది. దీంతోపాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని కూడా తెలియజేసింది.
ఇటీవల దేశ వ్యాప్తంగా తరుచూ రైల్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కొద్ది నిమిషాల తేడాతో ఏకంగా మడు రైళ్ల ప్రమాదం జరగడంతో తీవ్ర విషాదం నిండుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 288 మంది మరణించగా.. సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు.
మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా ఓ ప్రమాదంలో గాయపడిన వారు స్వస్థలాలకు వెళ్లే క్రమంలో మరో సారి ప్రమాదానికి గురై గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కొద్ది గంటల్లోనే మరో ప్రమాదం వెంటాడడంతో భయబ్రాంక్తులకు లోనయ్యారు.
ప్రాణం నీటి బుడగలాంటిది. ఎప్పుడు ఎలా కాలం తీరుతుందో తెలియదు. అనుకోకుండా చోటు చేసుకునే ప్రమాదాలతో కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటుంది. ప్రమాదాల్లో బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, తల్లి దండ్రులను పోగొట్టుకున్న పిల్లలు, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబసభ్యులు తీవ్ర దుఖంలో మునిగిపోతారు. అప్పటి వరకు తమతో ఉన్న వారు ఒక్కసారిగా ప్రాణాలతో లేరు ఇక తిరిగి రారు అని తెలిస్తే వారి కుటుంబసభ్యులు ఎంతటి క్షోభకు గురవుతారో ఊహకందని పరిణామం. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న కోరమండల్ రైలు ప్రమాదంలో గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ తండ్రి తన కొడుకు కోసం శవాల మధ్య వెతుకుతు కన్నీటి పర్యంతమైన తీరు ప్రతిఒక్కరిని కలచివేస్తుంది.
ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఎప్పుడు ఎలా ప్రాణాలు గాల్లో కలుస్తాయో ఊహించలేము హఠాత్తుగా జరిగే ప్రమాదాలు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపుతాయి. నిన్న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఎన్నో హృదయవిదారక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ హఠాత్పరిణామంతో దేశమంతా అలజడికి గురైంది. ఆ ట్రైన్ లో ప్రయాణించిన తమ వారి ఆచూకి కోసం కుటుంబ సభ్యులు బిక్కుబిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు. దశాబ్థకాలంలో చోటుచేసుకున్న ఇంతటి ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదం మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 238 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో జరిగిన రైలు ప్రమాద ఘటనల్లో అతి పెద్దది ఇదే కావచ్చు. అయితే ఇంత దారుణంలోనూ మానవత్వం పరిమళించింది. ఈ ఘటనల్లో గాయపడిన వారిని భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక్, మయూర్ భంక్, కటక్‌తో పాటు పలు ఆసుపత్రులకు తరలించారు. అయితే