ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఎప్పుడు ఎలా ప్రాణాలు గాల్లో కలుస్తాయో ఊహించలేము హఠాత్తుగా జరిగే ప్రమాదాలు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపుతాయి. నిన్న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఎన్నో హృదయవిదారక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ హఠాత్పరిణామంతో దేశమంతా అలజడికి గురైంది. ఆ ట్రైన్ లో ప్రయాణించిన తమ వారి ఆచూకి కోసం కుటుంబ సభ్యులు బిక్కుబిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు. దశాబ్థకాలంలో చోటుచేసుకున్న ఇంతటి ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

నిన్న రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ ప్రజలకు కంటీమీద కునుకులేకుండా చేసింది. ప్రమాద స్థలంలో క్షతగాత్రుల ఆర్తనాదాలు హోరెత్తాయి. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్ లోని హావ్ డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్ డా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలో శుక్రవారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీంతో కొన్ని బోగీలు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పై పడిపోయాయి. ఈ సమయంలోనే కోరమండల్ ఎక్స్ ప్రెస్ కోల్ కతా నుంచి చెన్నైకి ప్రయాణిస్తోంది. అయితే ఈ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రాక్ పై పడి ఉన్న హావ్ డా ఎక్స్ ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. దీంతో కోరమండల్ ఎక్స్ ప్రెస్ లోని కొన్ని బోగీలు బోల్తాపడ్డాయి. దీంతో ప్రమాదం ఆగకుండా ఆ ట్రాక్ పై దూసుకొచ్చిన గూడ్స్ రైలు కోరమండల్ ఎక్స్ ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.
అయితే ఈ ప్రమాదానికి సంబందించి గుండెలను పిండేసే విషయం ఒకటి వెలుగు చూసింది. ఒడిశాలోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేష్ జెన అనే యువకుడు తన తల్లి పెద్ద కర్మ నిర్వహించేందుకు చెన్నై నుంచి బాలేశ్వర్ వచ్చాడు. ఆ కార్యక్రమం అనంతరం తిరిగి చెన్నై వెళ్తూ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో మత్యువాతపడ్డాడు. మతుడి సోదరుడు చెప్పిన వివరాల ప్రకారం రమేష్ జన బ్రతుకుదెరువు కోసం చెన్నై వెళ్లి 14 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడని తెలిపారు. ఇటీవల తల్లి మరణించడంతో 14ఏళ్ల తరువాత ఇంటికి వచ్చాడని తెలిపాడు. తల్లి పెద్ద కర్మ నిర్వహించిన అనంతరం చెన్నై తిరిగి వెళ్తూ కోరమాండల్ ఎక్సప్రెస్ రైలు ప్రమాదంలో మృతిచెందాడని శోకతప్తతహృదయంతో చెప్పాడు. ఇప్పటికే ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడగా దాదాపు 250 పైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.