ఇటీవల దేశ వ్యాప్తంగా తరుచూ రైల్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కొద్ది నిమిషాల తేడాతో ఏకంగా మడు రైళ్ల ప్రమాదం జరగడంతో తీవ్ర విషాదం నిండుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 288 మంది మరణించగా.. సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది చనిపోగా.. సుమార 1175 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకటి కాదు మూడు రైళ్లు కేవలం 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురి కావడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రమాదంపై పలువరు సెలబ్రెటీలు, క్రీడా రంగానికి చెందినవారు.. పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదస్థలిలో ఉంటూ.. ట్రాక్ పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
దేశ వ్యాప్తంగా ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో మాటల్లో చెప్పలేం.. ఇప్పటికీ అక్కడ పరిస్థితి చూస్తుంటే మనసు చలించిపోతుంది. తప్పు ఎవరిదైనా.. జరిగిన ఘోరం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ప్రమాదానికి గురి కావడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు అంటున్నారు. ఇక బాలాసోర్ లో రైలు ప్రమాద ఘటన తర్వాత పట్టాల మరమ్మతు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతుంది. శనివారం అర్థరాత్రి వరకు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తిరిగి ఆదివారం ప్రమాద స్థలానికి చేరుకొని ట్రాక్ మరమ్మతు పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. మరోవైను ఒడిశా రైలు ఘటనపై రైల్వే మంత్రికి ప్రధాని మోదీ ఫోన్ చేసి రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాదానికి గల కారణం, అందుకు బాధ్యులైన వారికి గుర్తించామని ఆదివారం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ట్రాక్ పునరుద్దరణ పనులు పరిశీలిస్తున్నామని.. యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తున్నామని అన్నారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ పూర్తి చేశారని.. నివేదికను త్వరలో అందిస్తామని అన్నారు. రైళ్ల ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించామని.. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ మార్చడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. అయితే ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ ను ఎవరు మార్చారన్నది పరిశోధనలో తెలుస్తుందని.. ఈ ప్రమాదానికి కవాచ్‌తో సంబంధం లేదని రైల్వే మంత్రి వెల్లడించారు. ప్రధాని మోదీ నిన్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మేము ఈ రోజు ట్రాక్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాము. అన్ని మృతదేహాలను తొలగించారు. బుధవారం ఉదయానికి పునరుద్ధరణ పనులు పూర్తి చేయడం మా లక్ష్యం, తద్వారా ఈ ట్రాక్‌లో రైళ్లు నడవడం ప్రారంభించవచ్చు అని అన్నారు.
#WATCH | The root cause of this accident has been identified. PM Modi inspected the site yesterday. We will try to restore the track today. All bodies have been removed. Our target is to finish the restoration work by Wednesday morning so that trains can start running on this… pic.twitter.com/0nMy03GUWK
— ANI (@ANI) June 4, 2023