మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సంప్రదాయ క్రీడలు ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండగకు ఆడే కోడి పందాలు ఈ కోవలోకే వస్తుంది. అలాగే కర్ణాటకలో ఎద్దులతో నిర్వహించే కంబళ కూడా సంప్రదాయ క్రీడే. కోడి పందాలను ఎన్నో తెలుగు సినిమాల్లో చూసుంటారు. కంబళ ఆటను కూడా ‘కాంతార’ లాంటి పలు చిత్రాల్లో చూడొచ్చు. ఇకపోతే, ఇలాంటి మరో సంప్రదాయ క్రీడే జల్లికట్టు. తమిళుల పురాతన సంప్రదాయ క్రీడ ఇది.
ప్రతి ఏడాది పొంగల్ (తెలుగునాట సంక్రాంతి) సమయంలో ఈ పోటీలను ఘనంగా నిర్వహించడం తమిళనాడులో ఆనవాయితీగా వస్తోంది. కొన్నిసార్లు ఈ పోటీల్లో మనుషుల ప్రాణాలు కూడా పోతుంటాయి. అందుకే ఈ క్రీడను ఆపాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలాఉండగా.. జల్లికట్టు ఆడేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారని యువకులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. జల్లికట్టుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అనుమతి నిరాకరించడంతో గోబాచంద్ర గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యారు.
చెన్నై-బెంగళూరు నేషనల్ హైవేను నిరసనకారులు దాదాపు 6 గంటల పాటు బ్లాక్ చేశారు. పోలీసులతో పాటు వారి వాహనాల మీద యువకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఒక మహిళా ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆరు ప్రభుత్వ బస్సులు, మూడు పోలీసు వాహనాలను స్థానికులు, యువకులు ధ్వంసం చేశారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఉద్రిక్తతలతో హైవేపై కిలోమీటరు మేర ట్రాఫిక్ స్తంభించింది.
రోడ్ల మీదకు వేలాది మంది రావడంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో కృష్ణగిరి నుంచి అదనపు బలగాలను జిల్లా పోలీసు అధికారులు రప్పించారు. లాఠీచార్జ్ చేసి రాళ్ల దాడి చేసిన గ్రామస్తులను చెదరగొట్టారు. ఈ దాడిలో దాదాపు 20 మంది స్థానికులు గాయపడినట్లు సమాచారం. అక్కడ పరిస్థితి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు వేలాది మంది పోలీసులతో ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, కృష్ణగిరి జిల్లా కలెక్టర్ జయచంద్ర భాను రెడ్డి, ఎస్పీ సరోజా కుమార్ ఠాకూర్.. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇచ్చారని సమాచారం. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#TamilNadu: Hundreds of villagers blocked the Chennai-Bengaluru national highway, pelted stones on buses and police vehicles after the #Krishnagiri district administration refused to give permission for the bull dance and jallikattu. pic.twitter.com/4zHBwuXz8g
— TOIChennai (@TOIChennai) February 2, 2023