భారత దేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య పెను సంచలనాలు సృష్టించింది. పిన్నయసులో భారత ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి రాజీవ్ గాంధి. 1991, మే 21వ తేదీన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ.. తమిళనాడు శ్రీపెరుంబుదూర్‌లో తమిళ టైగర్స్ ఎల్టీటీఈ ఆత్మాహుతి బాం బు దాడిలో మృతి చెందారు. రాజీవ్ గాంధీ హత్య కేసు సీబీ సీఐడీకి అప్పజెప్పారు. తాజాగా రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్ తో పాటు మరో ఐదుగురు దోషులను విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలోనే రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్షకు తమిళనాడు ప్రభుత్వం అంగీకారం వ్యక్తం విషయం తెలిసిందే. ఈ అంశంపై కేబినెట్ లో తీర్మాణం కూడా చేశారు. తర్వాత గవర్నర్ కు సిఫార్సు చేయగా కొంతకాలంగా పెండింగ్ లో ఉంటూ వచ్చింది. ఈ విషయం పై నేడు న్యాయస్థానం ప్రస్థావించింది. మే నెలలో ఈ కేసులో ముఖ్య దోషిగా ఉన్న ఏజీ పెరారివాలన్ కేసును పరిగణలోకి తీసుకొని జస్టిస్ట్ బీఆర్ గవాయ్, జస్టిస్ట్ బీవీ నాగరత్న ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేశారు.
గత కొన్ని రోజులుగా పెరోల్ పై ఉన్న నళిని మద్రాస్ హై కోర్టులో పెట్టిన పిటీషన్ తిరస్కరించడంతో తనను విడుదల చేయాల్సిందిగా సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించినవారు రాజ్యంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం విడుదల చేయడానికి ప్రత్యేక హక్కులు ఉంటాయి.. ఈ అంశాన్ని పరగిణలోకి తీసుకొని ఇటీవల పెరారివాలన్ ని విడుదల చేశారు. అయితే పెరారివాలన్ కి వర్తించిన అంశాలే మిగిలిన ముద్దాయిలకు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నళినీ శ్రీహరన్ సహ మరో ఐదుగురిని విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.