ఇటీవల పరీక్షా కేంద్రంలో అభ్యర్థికి బదులుగా వేరే వ్యక్తి వచ్చి పరీక్షలు రాయడం.. స్క్వాడ్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసే సమయంలో అడ్డంగా దొరికిపోవడం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు అధికార యంత్రాంగం చేసే తప్పిదాల వల్ల హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటోకి బదులు సెలబ్రెటీల ఫోటోలు రావడం చూస్తూనే ఉన్నాం.. తర్వాత తమ తప్పిదం తెలుసుకొని సర్ధుబాటు చేసుకుంటున్నారు అధికారులు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. హాల్ టికెట్ పై శృంగారతార సన్నీలియోన్ అర్థనగ్న ఫోటో ఉండటం చూసి షాక్ కి గురైంది పరీక్ష రాసే అభ్యర్థి. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇటీవల టీచర్స్ రిక్రూట్ మెంట్ కి నోటిఫికేషన్ విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం. దీంతో అర్హులైన అభ్యర్తులు దరఖాస్తులు చేసుకున్నారు. హాట్ టికెట్స్ ని ఇంటర్ నెట్ లో డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి తన హాట్ టికెట్ డౌన్ లోడ్ చేసుకొని బిత్తరపోయింది. తన హాల్ టికెట్ పై శృంగారతార సన్నీలియోన్ ఫోటో.. అదికూడా అర్థనగ్నంగా ఉండటం చూసి షాక్ తిన్నది. హాట్ టికెట్ పై సన్నీలియోన్ ఫోటో ఉండటం చూసి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ అభ్యర్థి హాల్ టికెట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది.
ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పరీక్షా ఫీజులు తీసుకునే విషయంలో ఎంత కఠినంగా ఉంటారు.. కానీ అభ్యర్థుల ఫోటోలు అప్ లోడ్ చేయడంపై శ్రద్ద ఎందుకు చూపించరని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతమైతున్నా నిర్లక్ష్య దోరణి మాత్రం వీడటం లేదని విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ స్పందించి.. దీనిపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది.