శారీరక అవయవాలు అన్ని సరిగా ఉంటేనే పనిచేసేందుకు కొన్ని సందర్భాల్లో సాకులు చెబుతూ ఉంటాం. అమ్మ అడిగినా, నాన్న ఏమన్న తెమ్మన్నా కాకమ్మ కబుర్లు చెబుతుంటాం. కొంచెం కష్టానికే ఏంటిరా బాబు ఈ బతుకు అని విరక్తి మాటలు మాట్లాడుతాం. ఈ కష్టాలు ఎవ్వరికీ రాకూడదు రా అని బాధపడిపోతాం. మరి కొంతమందైతే నిరాశ, నిస్పృహలోకి వెళిపోతుంటారు. చదువులో ఫెయిలైనా, ఉద్యోగం దొరక్కపోయినా, చివరాకరు పెళ్లి కావట్లేదన్న సమస్యను భూతద్దంలో చూసి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. మనపై మనం ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోతున్నాం.
కానీ కష్టం వెనుకే సుఖం ఉందన్న నానుడిని మర్చిపోతున్నాం. ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నాం. అన్ని అవయవాలు సక్రమంగా ఉండీ కూడా సమస్యను అధిగమించలేకపోతున్నాం. మరీ ఒక చేయి, ఒక కాలు ఉంటే వాళ్ల పరిస్థితి గురించి ఆలోచించామా..? ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఒక వ్యక్తి తాను అంగవైకల్యమైనా బాధపడలేదు. ఒక్క కాలితోనే జీవితం సాగిస్తున్నాడు. ఒంటికాలితోనే బతుకు బండి ఈడుస్తున్నాడు. ప్రస్తుతం అతడి వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అందులో దివ్యాంగుడైన వ్యక్తి చేతికర్రనే ఆసారాగా చేసుకుని, మరో చేతితో రిక్షా లాగుతూ కనిపించాడు. ఇదేనెమో ఆత్మ విశ్వాసం. ఈ వీడియో ఎంతో స్ఫూర్తి నిస్తుందని, నీ గట్స్ కి సెల్యూట్ బ్రదర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
जीना है गर कुछ प्रयास तो करना होगा
स्वर्ग देखना है तो खुद को मारना होगाhttps://t.co/PwsFvru9b7 pic.twitter.com/PLzGJd3YdG— Aamir Khan ₚₐᵣₒdy (@AamirKhanfa) January 17, 2023