ఆ గ్రామంలోని ఓ పిల్లగాడు.. తన తల్లి కష్టం చూడలేక.. ఏకంగా ఇంట్లోనే బావిని తవ్వాడు. ఈ విషయం తెలిసిన అందరు ఆ బాలుడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. ఆ వివరాల్లోకి వెళ్తే..
నేడు ఉన్నట్లు ఒక్కప్పుడు ఇంటింటికి కుళాయిలు ఉండేవి కావు. వీధికి ఒక బోరు మాత్రేమే ఉండేది. మరికొన్ని గ్రామాల్లో అయితే అవి కూడా ఎండిపోయి దూర ప్రాంతాలకు వెళ్లి… వాగులు, నదుల్లోకి వెళ్లి నీరు తెచ్చుకునే వారు. నేటికి కూడ దేశంలోని అలాంటి గ్రామాలు ఇంకా కొన్ని ఉన్నాయి. మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలోని ఓగ్రామంలో కూడ నీటికి కష్టాలు ఉన్నాయి. ఆ గ్రామంలోని ఓ పిల్లగాడు.. తన తల్లి కష్టం చూడలేక.. ఏకంగా ఇంట్లోనే బావిని తవ్వాడు. ఈ విషయం తెలిసిన అందరు ఆ బాలుడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
మహారాష్ట్ర పాలఘర్ జిల్లాలోని ఓ మాముల గ్రామంలో ప్రణవ్ అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలసి నివాసం ఉంటున్నాడు. అయితే వారి ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉంది. అంతేకాక ఆ గ్రామానికి నల్ల సదుపాయం కూడా లేదు. దీంతో ప్రణవ్ తల్లి.. గ్రామానికి బయట ఉన్న నదిలో నుంచి నీరు తీసుకొచ్చేది. ప్రణవ్ పక్క గ్రామంలో ఉన్న పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజు బడికి వెళ్తున్న సమయంలో తన తల్లి నీటి కోసం పడుతున్న బాధను కళ్లారా చూసే వాడు. ఎలాగైన తల్లికి నీటి సమస్యను తొలగించాలని భావించాడు. ఇక తన ఇంటికి సమీపంలోనే 15 అడుగల లోతు వరకు బావిని తవ్వడు. ఆ బాలుడు కష్టానికి గంగమ్మ తల్లి మనస్సు కూడా కరినట్లు ఉంది. కేవలం 15 అడుగులు తవ్వగానే నీరు పైకి ఉబికి వచ్చింది.
అయితే ఆ బావిని తవ్వేందుకు ప్రణవ్ కు ఐదు రోజులు సమయం పట్టిందంట. బావిలో నీరు రావడంతో ప్రణవ్ తల్లి ఇంటి ముందే బకెట్ కు తాడు కట్టుకుని నీటిని తోడుకుంది. ఇక ఆ బాలుడు చేసిన మంచి పనికి ఊరందరు ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత చిన్న వయస్సులోనే తల్లి కష్టం అర్థం చేసుకున్న పిల్లవాడు భవిష్యత్తులో ఎంతో ప్రయోజకుడు అవుతాడని స్థానికులు అంటున్నారు. తన బిడ్డ చేసిన పనికి ప్రణవ్ తల్లి ఎంతగానో సంతోషం వ్యక్తం చేసింది. నీటి కోసం మైళ్ల దూరం నడిచేవారమని, ఇప్పుడు ఇంటి ముందే నీరు అందుబాటులో ఉండటంతో ఆ సమస్య తప్పిందని ఆమె తెలిపింది. మరి.. తల్లి కోసం ఆ బాలు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.