ఏపి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుందని ఎన్నోసార్లు వార్తల్లో చూశాం. అయితే ఎంతో పకడ్భందీగా ఉంటూ పహారా కాస్తూ అటవీ పోలీసుల కళ్లు గప్పి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేస్తారన్న ఎవరికీ తెలియదు. కానీ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలో కొన్ని సీన్లు బంగారం లాంటి ఎర్ర చందనాన్ని ఎన్ని రకాలుగా పోలీసులకు మస్కా కొట్టి తీసుకు వెళ్తారో కళ్లకు కట్టినట్టు చూపించారు.
ఇది చదవండి : చితిపై సగం కాలిన శవాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ఇక ‘పుష్ప’ మూవీ చూసి స్ఫూర్తి పొందిన ఓ ఘరానా స్మగ్లర్ సినిమా స్టైల్‌లో 2.45కోట్ల విలువైన 2 ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ నిందితుడి పేరు సయ్యద్ యాసిన్. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి ఎర్ర చందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రెండు కోట్ల నలభై ఐదు లక్షలకు పైనే అని తేలింది. ఇక దుంగలను తరలించేందుకు ఉపయోగించే లారీ విలువ రూ.10 లక్షలకు పైగే ఉంటుందని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న ఆనేకల్‌కు చెందిన సయ్యద్ యాసిన్ తన లారీలో కరోనా భాదితుల కోసం పండ్లు తరలిస్తున్నట్లు పోలీసులకు చెప్పేవాడు.
ప్రతి చెక్ పోస్ట్‌లో పోలీసులను ఇలాగే నమ్మించేవాడు. మొత్తానికి ఇతగాడి బండారం బయట పడింది.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక బార్డర్‌లలో పోలీసులను సులభంగా నమ్మించ గలిగినా.. చివరకు మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీని వెనుక ఉన్న ముఠా ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
A smuggler who was inspired after watching movie #Pushpa, tried 2 smuggle red sandalwood worth 2.45cr in movie style. Smuggler Yasin Inayithulla loaded truck wit red sandalwood & on top of tat he loaded wit fruits & vegetable boxes. He was arrested by @MahaPolice near Sangli pic.twitter.com/fsOqRlzGFF
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) February 2, 2022
Smuggler somehow crossed Karnataka border without any hassle or trouble frm police. Once he crossed the border, his luck caught up with him & he got caught by the Maharashtra Police. Now police are investigating him to ascertain the network behind him & how they are operating. pic.twitter.com/ts483mt4bI
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) February 2, 2022