గత కొంత కాలంగా రాజకీయ, సినీ ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. శివసేన పార్టీలో విషాదం చోటు చేసుకుంది. శివసేన ముఖ్యనేత.. ఎమ్మెల్యే రమేష్ లట్కే కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. ఇటీవల ఆయన తన స్నేహితుడిని కలిసేందుకు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనకు బుధవారం తీవ్ర గుండెపోటు రావడంతో చనిపోయినట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్ తెలిపారు. లట్కే కుటుంబ సభ్యులతో పాటు భౌతిక కాయాన్ని భారత్ కి రప్పించే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్టిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు లట్కే. రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ఉంది. మూడుసార్లు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌కు(బీఎంసీ) కార్పొరేటర్ గా పనిచేసిన ఆయన ప్రజల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యే లట్కే మరణం పట్ల శివసేన,బీజేపీ సహా పలు పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.