దేశ వ్యాప్తంగా ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాది రాష్ట్రాల నుండి దక్షిణాది రాష్ట్రాల వరకు పట్టణాల నుండి గ్రామాల వరకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇక మహా నగరాల సంగతి చెప్పనక్కర్లేదు.
దేశ వ్యాప్తంగా ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాది రాష్ట్రాల నుండి దక్షిణాది రాష్ట్రాల వరకు పట్టణాల నుండి గ్రామాల వరకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇక మహా నగరాల సంగతి చెప్పనక్కర్లేదు. రోడ్డు జలమయమయ్యాయి. చిన్నపాటి వర్షాలకు మోకాళ్ల లోతు నీళ్లు వచ్చి చేరాయి. ఇక విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఈ వర్షాల కారణంగా సామాన్యులే కాదూ.. సెలబ్రిటీలు సైతం ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా ప్రముఖ నటి ఈ వర్షాల కారణంగా ఏకంగా కోట్లు విలువ చేసే కార్లను పోగొట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకు ఆ నటి ఎవరంటే..?
ముంబయి నగరం గురించి చెప్పనక్కర్లేదు. ఆర్థిక నగరమైన ముంబయిలో హడావుడి గందరగోళంగా ఉంటుంది. ఇక చిన్నపాటి వర్షాలకు నీట మునిగిపోతుంది. ఈ వర్షాల నుండి సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం సతమతమయ్యారు. ఈ వర్షాలకు తాను కార్లను కోల్పోయానని బాధను వెలిబుచ్చింది బాలీవుడ్ నటి సన్నీలియోన్. ఒకటి, రెండు కాదు మూడు లగ్జరీ కార్లను కోల్పోయానని తెలిపింది. ఆమెకు ఎదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ‘నేను మొదటిసారి ఇండియా వచ్చినప్పుడు ముంబయిలో ఉన్నాను. సముద్రానికి దగ్గర ఉన్నానని ఆనందపడ్డాను. వర్షం పడినప్పుడు గోడలు తడిసి ముద్దయ్యాయి. అయినప్పటికీ ఇష్టపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది.
‘ఈ వర్షాల కారణంగానే మూడు లగ్జరీ కార్లను పొగొట్టుకున్నాను. ఒకే రోజులో రెండు పోయాయి. అది భయంకరమైన పరిస్థితి. నేను ఏడ్చాను కూడా. భారత్ దిగుమతి చేసుకునే కార్లపై ఎక్కువ పన్ను కూడా చెల్లించి మరీ కొనుగోలు చేసుకుంటాం. అలాంటిది ఆ కార్లు పోయేసరికి నా బాధ వర్ణనాతీతం. అందులో ఎనిమిది సీటర్ల మెర్సిడస్ ట్రక్ కూడా ఉంది. అయితే ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం సంతోషకరం. ఇప్పుడు పూర్తిగా ఇండియా మేడ్ కార్లను కొనుగోలు చేస్తున్నానని చెప్పింది.