అత్తాకోడళ్లు అంటే ఎప్పుడు తిట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరైతే గొడవలు, పంచాయతీలు పెట్టుకుని నానా రభస చేస్తుంటారు. ఇంకొందరు అత్తాకోడళ్లు ఏండ్ల తరబడి మాటలు కూడా మాట్లాడుకోకుండా గడుపుతుంటారు. కానీ ఓ అత్త కోడలి కోసం త్యాగం చేసి తన మాతృత్వాన్ని నిరూపించుకుంది.
సమాజంలో మనం చూసినంత వరకు అత్తాకోడళ్లు అంటే ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ మాటల యుద్ధాలు జరగడం సహజం. కొందరైతే గొడవలు, పంచాయతీలు పెట్టుకుని నానా రభస చేస్తుంటారు. ఇంకొందరు అత్తాకోడళ్లు ఏండ్ల తరబడి మాటలు కూడా మాట్లాడుకోకుండా గడుపుతుంటారు. అయితే ఇంట్లో ఆడవారు అలా చేస్తుంటే మగవారికి చాలా కష్టంగా ఉంటుంది. అటు తల్లికి నచ్చచెప్పలేక.. ఇటు భార్యకు సర్థిచెప్పలేక సతమతమవుతూ ఉంటారు. అయితే కొందరు అత్తలు కోడళ్లను సొంత కూతుళ్లవలె చూసుకుంటారు. అలాంటిదే ఈ అమిషా విషయంలో జరిగింది. అమిషాకు కిడ్నీ జబ్బు ఉందని తెలియగానే తన కోడలు బ్రతకాలని కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చింది అత్త ప్రభ. తన కిడ్నీ ఇచ్చి కోడలి ప్రాణాలను నిలిపింది. అసలు వివరాల్లోకి వెళితే..
కుటుంబసభ్యలు అందరు హాయిగా సంతోషంగా ఉన్న సమయంలో అనుకోకుండా ఓ అలజడి చెలరేగింది. అమిషా హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కిడ్నీ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని.. వ్యాధి ప్రాణాంతక దశలో ఉన్నట్లు డాక్టర్లు అమిషా భర్త జితేష్‌కు చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే ఆమె బతికే చాన్స్ ఉందని తెలిపారు. దీంతో జితేష్ తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. కానీ అతనికి షుగర్ ఉంది కాబట్టి అతనిది కిడ్నీ డొనేట్ చేయడం కుదరదని వైద్యులు చెప్పారు.
అమిషా పేరెంట్స్‌తో సహా వారి బంధువులు కిడ్నీ డొనేషన్‌కు ముందుకు వచ్చారు. కానీ వైద్య పరీక్షలు చేయగా వారివి అన్‌ఫిట్‌గా తేల్చారు డాక్టర్లు. అయితే అదే సమయంలో జితేష్ తల్లి అయిన ప్రభ కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చింది. ఆమెకు 70 సంవత్సరాలు. వయసు కారణంగా కిడ్నీ ఇవ్వడానికి సరిపోతారా.. లేదా అనే సందిగ్ధంలో వైద్యులు పరీక్షలు జరుపారు. ఆమె అన్ని టెస్టుల్లో కిడ్నీ ఇచ్చేందుకు ఫిట్‌గా తేలింది. ప్రభకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. తన భర్త, ఇద్దరు కొడుకులు, కోడలు అమిషా వద్దని ఎంత చెప్పినా వినకుండా తన కోడలి ప్రాణం కాపాడుకునేందుకు కిడ్నీ ఇచ్చింది. అత్త ప్రభ కిడ్నీ కోడలు అమిషాకు మ్యాచ్ అయిందని వైద్యులు వెల్లడించారు.
గత నెలలో నానావతి ఆస్పత్రిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరిగింది. డా. జతిన్ కొఠారి నేతృత్వంలో ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రస్తుతం అత్తాకోడళ్లు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. సర్జరీ నుంచి అత్తాకోడళ్లు ఇద్దరు కోలుకుంటున్నారు. ఆగష్టు 4వ తేదీన తిరిగి ఇంటికి వచ్చారు. స్థానికులంగా ప్రభ చేసిన మంచిపనికి ఘనస్వాగతం పలికారు. అమిషా తల్లి ఆమెను హత్తుకుని ఏడ్చేసింది. తల్లిగా తను అమిషాకు జన్మనిచ్చినప్పటికీ, అత్తమ్మగా.. కిడ్నీ దానం చేసి పునర్జన్మను ఇచ్చిందంటూ భావోద్వేగానికి లోనైంది.
ఈ సందర్భంగా అమిషా భర్త జితేష్ మాట్లాడుతూ.. ఆరోగ్యం క్షీణిస్తున్న అమిషాను మా అమ్మ చూడలేకపోయింది. అందుకే ఆమెను కాపాడాలనుకుంది. వద్దని నేను, నాసోదరుడు, మా నాన్న కూడా ఎంతో బతిమాలాం. అయినా కోడలి కోసం మా అమ్మ సాహసం చేసింది. ‘అమిషా నా బిడ్డ లాంటిది.. బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి ఎంతదాకా అయినా వెళ్తుంది కదా’ అని అత్త ప్రభ తెలిపింది. ఇది కదా సమాజంలోని అత్తాకోడళ్ల మధ్య ఉండవలసిన బంధం.. పైపైకి మాట్లాడుతూ ఎప్పుడూ గొడవపడే వారికి ఆదర్శంగా నిలిచారు ఈ అత్తాకోడళ్లు. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.