కర్ణాటకలో ఈ నెల 10 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. మే 13న ఫలితాలు వెలువడున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు హూరాహూరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
సాధారణంగా పెద్ద స్థాయి నాయకులు ర్యాలీలు, రోడ్ షోలు చేస్తున్న సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తుంటారు. కానీ కొన్ని సమయాల్లో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో భద్రతా లోపాలు బయటపడుతుంటాయి. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా దారితీస్తుంటాయి. కర్నాటకలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఓ మహిళ చూపించిన అత్యుత్సాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా మైసూర్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో అనూహ్య సంఘటనల ఎదరైంది. ఆదివారం రాత్రి ప్రత్యేక వాహనంలో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. ఇరువైపులా ప్రజలు, కార్యకర్తలు ఆయనకు పూలు చల్లూతు జై మోదీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇంతలోనే హఠాత్తుగా ఆయన వాహనంపై ఓ మొబైలో ఫోన్ పడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీన్ని మోదీ కూడా గమనించారు.. వెంటనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అప్రమత్తం చేశారు. ఆ మొబైల్ ని స్వాధీనం చేసుకొని పరిశీలించారు. పోలీసులు రంగంలోకి దిగి మొబైల్ విసిరిన మహిళను గుర్తించి ప్రశ్నించారు.
ఆ మహిళ బీజేపీ కార్యకర్త. ప్రధాని మోదీ అంటే ఎంతో అభిమానం.. చాలా కాలంగా ప్రధానిని చూడాలనే ఆశ ఉండేదని.. ఆయనను చూడగానే ఆనందం పట్టలేక తాను అలా చేశానని వివరించింది. ఈ వ్యవహారంలో మహిళా కార్యకర్తకు ఎలాంటి దురుద్దేశం లేదని.. పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ మహిళకు ఫోన్ అందించారు. ప్రధాని మోదీకి ఆ మహిళా కార్యకర్త హార్డ్ కోర్ ఫ్యాన్.. ఆమె బీజేపీ కార్యకర్త.. ఫోన్ విసరడంలో ఎలాంటి దురుద్దేవం లేదని తెలిపింది.. ఎస్ పీజీ సిబ్బంది ఆమె ఫోన్ తిరిగి ఇచ్చేశారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబందించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మే 10న ఎన్నికలు జరగనున్నాయి.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
#WATCH | Security breach seen during Prime Minister Narendra Modi’s roadshow, a mobile phone was thrown on PM’s vehicle. More details awaited. pic.twitter.com/rnoPXeQZgB
— ANI (@ANI) April 30, 2023