సామాన్య జనాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వెైద్యం చేయించుకునే స్థోమత ఉండదు. దాంతో వారు తమ దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకుంటారు. అలాంటి వారి ప్రాణాలతో కొంత మంది డాక్టర్లు చలగాటం ఆడుతున్న సంఘటనలు మనం రోజు చాలానే చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేసిన సంఘటన సంచలనం సృష్టించింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తిరుత్తణి యూనియన్ వీకేఆర్ పురం కాలనీకి చెందిన బాలాజీ-కుపేంద్రి భార్య భర్తలు. కుపేంద్రిని 2013లో ప్రసవం కోసం తిరుత్తణి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఈ సమయంలోనే వైద్యులు ఆమె కడుపులో పొరపాటున కత్తెర ఉంచి కుట్లు వేశారు. అప్పుడు ఆవిషయం ఎవరికీ తెలిదు. 12 ఏళ్ల తర్వాత కుపేంద్రికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు స్కాన్ చేయగా కడుపులో కత్తెర ఉండటాన్నివైద్యులు గుర్తించారు. 12 ఏళ్ల నుంచి కడుపులోనే కత్తెర ఉందన్న వార్త తెలిసి డాక్టర్లు కంగుతిన్నారు.
దీంతో ఆమెకు చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. కడుపులో ఉన్న కత్తెరను తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి భర్త బాలాజీ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాణాలు పోసే డాక్టర్లే ఇలా చేస్తూంటే సామాన్యుల పరిస్థితి ఏంటని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.