వీడియో గేమ్ ప్రియులకు ఇది అశుభవార్తనే చెప్పాలి. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ బ్యాన్ అయ్యింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించారు. గతంలో పబ్‌జీని బ్యాన్ చేయగా.. క్రాఫ్టన్ కంపెనీ బ్యాటిల్ గ్రౌండ్ ఇండియా మొబైల్‌గా తిరిగి ఇండియాలో లాంఛ్ చేశారు. ఇప్పుడు ఆ గేమ్ ను కూడా బ్యాన్ చేశారు. కేంద్రం ఆదేశాలతోనే గూగుల్ ఈ గేమ్ ని భారత్ లో బ్యాన్ చేశారు.
పబ్ జీ తర్వాత బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ గేమ్ కు మంచి ఆదరణే లభించింది. 10 కోట్లకు మించిన డౌన్లోడ్స్ తో ఇండియాలో నంబర్ వన్ గా గేమ్ గా కొనసాగుతోంది. యూజర్స్ డేటాని విదేశీ సర్వర్లకు ట్రాన్స్ ఫర్ చేస్తోందనే కారణంతో ఐటీ యాక్ట్ 2020 కింది ఈ గేమ్ ని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో పబ్ జీని కూడా ఇదే యాక్ట్ కింద బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
#BGMI officiall Announcement of Ban in India … pic.twitter.com/hHyo2hSNk6
— Himanshu Mishra (@Hima_nshu17) July 28, 2022
ఇప్పటికే భారత ప్రభుత్వం చైనాకు చెందిన వందల యాప్స్ ను బ్యాన్ చేసిన, చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే బీజీఎంఐని కూడా బ్యాన్ చేసినట్లు ఉన్నారు. నిజానికి క్రాఫ్టన్ పేరుకి దక్షిణ కొరియా గేమ్ డెవలపర్ అయినా కూడా.. దానిలో చైనాకు చెందిన టెన్సెంట్ పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. ఒక్కసారిగా ప్లేస్టోర్ నుంచి బీజీఎంఐ గేమ్ మాయం కాగానే యూజర్లు, గేమింగ్ ప్రియులు అంతా కంగుతిన్నారు.
Google releases statement, “On receipt of the order,
BGMI @BgmiDev ban in India seems confirmed now as reports claim that it was due to a government order, a person familiar with the matter confirmed..@BgmiDev#BGMI#bgmibanned #bgmiremoved#bgmiban #BBNaijaLevelUp pic.twitter.com/3ZM1CzkpOt
— It’s ‘Me’…!!! (@RJChanchiya) July 29, 2022
ప్రభుత్వ ఆదేశాలతోనే, క్రాఫ్టన్ కంపెనీకి సమాచారం అందించిన తర్వాతే.. బీజీఎంఐ గేమ్ ని ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు. అసలు ఎందుకు ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి బీజీఎంఐ గేమ్ ని తొలగించారో తమకు ఇంకా తెలియదని.. తెలుసుకునే పనిలో ఉన్నామని.. తెలియగానే అప్‌డేట్ చేస్తామంటూ క్రాఫ్టన్ కంపెనీ యూజర్లకు తెలియజేసింది. బీజీఎంఐని బ్యాన్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The government once again banned the BGMI game.
What’s your opinion on this ban🤔?#BGMI #PUBGMOBILE #bgmiban pic.twitter.com/rTykYg6ApP
— Piyush VAAH! SAMOSA (@Piyush_VaahS) July 28, 2022