మీకు ఏ యాప్ కావాలన్నా కచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే బయటి సోర్సెస్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం అంత సురక్షితం కాదు. ప్లే స్టోర్ లో అయితే ఒక వేళ ఏమైనా హానికరమైన యాప్స్ ఉంటే వాటిని ప్లేస్టోర్ వాళ్లే తొలగిస్తారు. అలా ప్లే స్టోర్ ఏకంగా 3,500 యాప్స్ తొలగించింది.
స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి గూగుల్ ప్లే స్టోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన యాప్స్ అన్నీ ప్లే స్టోర్ లోనే ఉంటాయి. పైగా మీరు ప్లే స్టోర్ నుంచి యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోవడమే సురక్షితం కూడా. బయటి నుంచి ఏపీకే ఫైల్స్, తెలియని ప్లాట్ ఫామ్స్ నుంచి యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీ వ్యక్తిగత సమాచారం కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ అలాంటి ప్రమాదకర యాప్స్ ఏమైనా ఉంటే ముందుగా ప్లే స్టోర్ వాళ్లే తొలగిస్తారు. అలా ప్లే స్టోర్ తొలగించిన యాప్స్ గురించి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ప్లే స్టోర్ ఒకటి కాదు, రెండు ఏకంగా 3,500 యాప్స్ ని తొలగించింది. అసలు వాటిని ఎందుకు తొలగించింది అని కూడా వెతుకుతున్నారు.
మీరు రుణ యాప్స్ ఆగడాలు, లోన్ యాప్ వల్ల ఆత్మహత్యలు అని వార్తలు వినే ఉంటారు కదా. అలాంటి రుణ యాప్స్ నే గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది. 2022వ సంవత్సరంలో మొత్తం 3,500 యాప్స్ ని తొలగించినట్లు ప్లే ప్రొటెక్ట్ నివేదిక వెల్లడించింది. 2021లోనే భారత్ కు సంబంధించి వ్యక్తిగత రుణాలు, ఫైనాన్స్ యాప్స్ విషయంలో గూగుల్ తమ విధానాలను అప్ డేట్ చేసింది. ఆ ప్రకారం ఎవరైనా రుణాలు ఇచ్చే యాప్స్ స్టార్ట్ చేయాలంటే అందుకు ఆర్బీఐ నుంచి అనుమతి ఉండాలి. అలాగే వారికి అనుమతి ఉన్నట్లు యాప్ డెవలప్పర్స్ ప్లే స్టోర్ కి ధ్రువీకరించాలి. అలా అనుమతి లేనిపక్షంలో.. అనుమతి ఉన్న వారికి కేవలం ప్లాట్ ఫామ్ గా మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. 2022లో మరిన్ని షరతులను యాడ్ కూడా చేశారు. ఒక్క భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ప్లే స్టోర్ రుణ యాప్స్ విషయంలో ఇంతే కఠిన చర్యలు తీసుకుంటోంది.