ఆకాశంలో అప్పుడప్పుడు మనకు ఎన్నో అద్బుత దృశ్యాలు కనిపిస్తుంటాయి. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఆకాశంలో జరుగుతున్న అరుదైన అద్భుత దృశ్యాలను వీడియో, ఫోటోలు చూడగలుగుతున్నాం.
సాధారణంగా అప్పుడప్పుడు ఆకాశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కానీ, మనం వాటన్నింటినీ చూడలేం. ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఆకాశంలో జరుగుతున్న అద్భుతాలను మన కళ్లముందు ఆవిష్కరిస్తున్నారు. శనివారం సాయంత్రం ఆకాశంలో అద్భుత దృశ్యం చూపరులను ఎంతగానో ఆకర్షించింది.. ఇంకేముంది అందరు ఆ అందమైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆకాశంలో కొన్నిసార్లు ఎప్పుడూ చూడని అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. శనివారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ ఒఖ రంగురంగుల వెలుగు తో కూడిన వలయం ఏర్పడంది. ఇంద్రధనస్సులో ఉండే రంగులతో ఏర్పడిన ఈ వలయం చూడ ముచ్చటగా కనిపించింది. ఆకాశంలో కనిపించిన ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి ఢిల్లీ వాసులు ఆసక్తి చూపించారు. తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ అరుదైన దృశ్యం నెట్టింట తెగ వైరల్ గా మారిపోయింది. సూర్యుడి చుట్టు రంగుల వలయం చూసిన చూసిన నెటిజన్లు ఎంతో అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి దృశ్యాలు ఎప్పుడో ఒక్కసారి ఏర్పడుతాయని.. మేఘాల్లోని షట్భుజాకార మంచు స్పటికాల గురించి సూర్య కిరణాలు వంగి ప్రయాణించడం జరుగుతుంది.. అలాంటి సమయంలో ఇలా రంగు వలయాలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్ని శాస్త్రపరిభాషలో 22 డిగ్రీ హలోస్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇలాంటి వలయాలు భూమికి 8 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో వలయాలుగా ఏర్పడుతాయని.. అందుకే మనకు అంత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.
A #halo can be observed around sun right now from #Delhi.Go outside and watch it now#DelhiRains pic.twitter.com/Ppu7R6I9ez
— m n (@mn11107373) May 27, 2023