అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు యోగాగురు బాబా రామ్ దేవ్ ప్రకటించారు. అంతేకాకుండా ఎవరి మనసులనైనా కష్టపడితే క్షమించాలని కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ సైతం వ్యాఖ్యలపై స్పందిస్తూ వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే బాబా నేతృత్వంలోని పతంజలి యోగా సంస్థ దీనిపై వివరణ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను ఎడిట్ చేశారని, ఆధునిక సైన్స్ మీద ఆయనకు ఎంతో గౌరవం, విశ్వాసం ఉన్నాయని పేర్కొంది. వీటిపై బాబాకు ఎలాంటి దురుద్దేశాలు లేవని వివరించింది. అల్లోపతి ఒక కుంటి శాస్త్రం మొదట, హైడ్రాక్సీక్లోరోక్విన్ విఫలమైంది. ఇప్పుడు రెమ్‌డెసివిర్, ఐవర్‌మెక్టిన్, ప్లాస్మా థెరపీ విఫలమయ్యాయి. ఫాబిఫ్లు, స్టెరాయిడ్లతో సహా ఇతర యాంటీబయాటిక్స్ కూడా విఫలమయ్యాయని బాబా రామ్‌దేవ్ ఆరోపించారు.
ఆక్సిజన్ కొరత కంటే అల్లోపతి మందుల వల్ల లక్షలాది మంది రోగులు మరణించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబా రామ్ దేవ్ పాల్గొన్న ఈవెంట్ లో తనకు అందిన వాట్సాప్ సందేశాన్ని ఆయన చదివారని, అంతే తప్ప ఆయనకు ఆపాదిస్తూ వచ్చిన సమాచారం తప్పుడుదని పేర్కొంది. అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు యోగాగురు బాబా రామ్ దేవ్ ప్రకటించారు. వివాదాస్పద వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలు కూడా దెబ్బ తీశారంటూ పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారని, ఈ పోరాటాన్ని నీరుగార్చవద్దని కోరారు.