21వ శతాబ్దంలో కూడా బాబాలను నమ్మేవారు ఉంటారా? అంటే! ఎవరి నమ్మకాలు వారివి అనే సమాధానం వస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరికి ఇష్టమైన మతాన్ని, ఇష్టమైన దేవుణ్ణి వారు నమ్ముకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఓ పోలీసు అధికారి మాత్రం హత్య కేసులో ఓ బాబా సహాయం తీసుకుని వార్తల్లోకి ఎక్కాడు. దీంతో అతడు సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు హత్య కేసులు చేధించే క్రమంలో టెక్నాలజీని వాడతారు. దాంతో హంతకుణ్ణి సులువుగా పట్టుకోవడానికి వీలుపడుతుంది. కానీ ఈ పోలీసు మాత్రం బాబా మాటలను విని కేసును దర్యాప్తు చేశాడు. సదరు విషయం కాస్త లీక్ కావడంతో సస్పెన్షన్ కు గురైయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ లో జరిగింది.
ఛతర్ పూర్ లోని ఒంటపూర్వా గ్రామంలో జూలై 28న బావిలో ఓ బాలిక మృతదేహాం దొరికింది. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి సరైన సాక్ష్యాలు లేవని వదిలేశారు. కొద్ది రోజుల తర్వాత బాలిక మేనమామ తిరత్ అహిర్వార్ ను పోలీసులు అరెస్ట్ చేయగా ఆ హత్య తనే చేశాడని ఒప్పుకున్నాడు. దీంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చిందని అందరు అనుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ కేసు విషయమై ASI అనీల్ శర్మ స్థానిక బాబా పండోఖర్ సర్కార్ నుంచి సాయం కోరిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ బాబా కూడా నిందితుడు మజ్ గువాన్ గ్రామంలోనే ఉన్నాడని చెప్పాడు. అయితే ఈ వీడియోపై పోలీసు ఉన్నాతాధికారులు చర్యలు చేపట్టారు. ASI అనీల్ శర్మ ను సస్పెండ్ చేశారు. అదీ కాక ఎస్పీ సచిన్ శర్మ ఈ కేసును సాల్వ్ చేయడానికి ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశాడు. మరి ఉన్నత చదువులు చదివి కూడా ఇలా బాబాల మాటల నమ్మే అధికారులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In a bid to identify the suspect in the death of a 17-year-old girl,ASI Anil Sharma from Chhatarpur reached out to Pandokhar Sarkar, he could be heard saying he has called out the names of a few people the name he missed will lead them to the suspect @ndtv @ndtvindia pic.twitter.com/u2RrpaLuYG
— Anurag Dwary (@Anurag_Dwary) August 19, 2022