కొన్ని ఘటనలు జీవితంపై విరక్తిని కలిగిస్తే, మరికొన్ని సంఘటనలు మనిషి పుట్టుకే వ్యర్థమనేలా గుర్తు చేస్తుంటాయి. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కొన్ని నిర్ణయాల వల్ల రోజుకు ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన దీనికి సాక్షంగా నిలుస్తోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ లోని ఛతార్ పూర్ జిల్లా పౌడీ గ్రామం. ఇదే గ్రామానికి చెందిన ఓ చిన్నారి ఇటీవల తీవ్ర అస్వస్థకు గురైంది. దీంతో వెంటనే స్పందించిన తండ్రి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ చిన్నారికి అక్కడ చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆస్పత్రిలోనే మరణించింది. బిడ్డ మరణావార్త విన్న తండ్రి శోక సంద్రంలో మనిగిపోయాడు.
ఇది కూడా చదవండి: Truck Tire: అయ్యో పాపం! టైరు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఇక ఆ శవాన్ని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో అంబులెన్స్ కావాలంటూ అధికారులను వేడుకున్నాడు. దీనికి నిబంధనలు వర్తించవంటూ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక తండ్రి ఆ శవాన్ని తన భుజాలపై వేసుకుని నడకదారిలో ఇంటికి వెళ్తున్నాడు. తండ్రి తన బిడ్డ శవాన్ని అలా భూజాలపై మోసుకెళ్తున్న సమయంలో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్స్ గుండెల్ని పిండేసేలా ఉందంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన కొందరు వ్యక్తులు అధికారులు తీరుపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
A family in Chhatarpur had to carry the dead body of a four-year-old girl on their shoulders as the authorities allegedly did not provide a hearse to them to return to their village @ndtv @ndtvindia pic.twitter.com/vyTJ0meRpp
— Anurag Dwary (@Anurag_Dwary) June 10, 2022