సోషల్ మీడియా పాపులర్ అయ్యాక ఎంతో మంది సెలబ్రిటీలుగా మారారు. టిక్ టాక్ వచ్చిన కొత్తలో అయితే చాలా మంది పాపులర్ అయిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో తమ టాలెంట్‌ని బయటపెడుతున్నారు. కొందరైతే ఈ షార్ట్ వీడియోలతోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూఎన్సర్లుగా మారిపోతున్నారు. ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అన్నింట ఈ షార్ట్ వీడియోల ఆప్షన్ అనేది ఉంది. దానిని ఉపయోగిస్తూ చాలా మంది డాన్స్ వీడియోలు, కుకింగ్ వీడియోలు, ఫన్నీ వీడియోలు చేస్తూ పేరు సంపాదిస్తున్నారు. అమ్మాయిలైతే ఎక్కువగా డాన్సు వీడియోలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఏ డాన్సు వీడియోలతో అయితే పాపులర్ అయ్యిందో ఇప్పుడు ఆ డాన్సు రీల్ వల్లే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ వైరల్ డాన్సు వీడియో చేసిన అమ్మాయి పేరు ముస్కాన్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ కాస్త పాపులర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు 4 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వీడియో కంటెంట్ క్రియేటర్‌గా భోపాల్ లో కాస్త పాపులర్ అనే చెప్పాలి. ఎప్పుడూ డాన్స్, ఫన్నీ వీడియోలు చేసే ఈ భామ.. ఇటీవలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్‌పూర్ జిల్లాలోని ఓ గుడికి వెళ్లింది. అక్కడ చిరిగిన జీన్సు ధరించి గుడి మెట్లపై ‘మున్నీ బదనామ్ హుయీ’ అంటూ స్టెప్పులు వేసింది. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుందని భావించింది. వైరల్ అవుతుందని భావించింది. ఆ వీడియో నిజానికి బాగానే వైరల్ అయ్యింది. ఎంతలా అంటే నేరుగా హోంమంత్రి స్పందించే అంతలా వైరల్ అయ్యింది.
ముస్కాన్ చేసిన ఆ వీడియోపై ట్రోల్స్ రావడంతో ఆమె తప్పును గ్రహించింది. అలా చేయడం నా తప్పే.. అలా చేయకుండా ఉండాల్సింది. నన్ను క్షమించండి అంటూ ముస్కాన్ ఒక వీడియో కూడా చేసింది. గుడిమెట్లపై తాను చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్స్ నుంచి డిలీట్ కూడా చేసింది. కానీ, హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాత్రం శాంతించలేదు. ఆమె క్షమాపణ చెప్పినా.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. “అలాంటి వస్త్రధారణతో ఆమె వీడియో తీయడం అభ్యంతరకరంగా ఉంది. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు చర్యలు తీసుకున్నాం. అందుకే ఈ యువతిపై కూడా కేసు నమోదు చేయబోతున్నాం” అంటూ ప్రెస్ మీట్‌లో క్లారిటీ ఇచ్చారు. ఛతర్‌పూర్ ఎస్పీని ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
छतरपुर में माता बम्बरबैनी मंदिर परिसर में आपत्तिजनक फिल्मांकन के खिलाफ एफआईआर दर्ज करने के निर्देश पुलिस अधीक्षक को दिए गए हैं। pic.twitter.com/X7euV9Z1qv
— Dr Narottam Mishra (@drnarottammisra) October 4, 2022