యూనిక్ డిజైన్ తో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న ‘నథింగ్ ఫోన్’ జులై 12న మార్కెట్ లోకి వచ్చింది. అంచనాలకు తగ్గట్టే.. ట్రాన్సపరెంట్ బ్యాక్ ప్యానెల్, గ్లిఫ్ ఇంటర్ఫేస్తో కూడిన ఎల్ఈడీ లైట్స్ స్ట్రిప్ తో అందరని ఆకట్టుకుంది. ఈ డిజైన్ చూశాక ఫోన్ సొంతం చేసుకోవాలన్న ఆరాటంతో ఎంతో మంది ముందుగానే బుక్ చేసుకున్నారు. కానీ వారి ఆశలు ఫలించలేదు. డెలివరీల్లో జాప్యం నెలకొంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి వీలైనంత త్వరగా డెలివరీ చేస్తామని కంపెనీ అప్పట్లో ప్రకటించింది. కానీ, ఆలా జరగడం లేదు.
నథింగ్ ఫోన్ కోసం రూ. 2,000 ప్రీ ఆర్డర్ రూపంలో ముందుగానే చెల్లించి ఎంతో మంది బుక్ చేసుకున్నారు. వారందరికి ఫోన్లు సకాలంలో అందడం లేదు. ఈ క్రమంలో నథింగ్ కంపెనీ ఇండియా హెడ్.. మను శర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఫోన్ అందడంలో జాప్యం నెలకొన్నందుకు మేము క్షమాపణలు కోరుతున్నాం. ఫోన్ బ్యాక్ ప్యానెల్ వల్ల ఉత్పత్తిలో ఆలస్యం నెలకొనలేదు. విడిభాగాలతో కూడిన అసెంబ్లింగ్ వల్లే ఆలస్యం అవుతోంది. చాలా ఫోన్లను ఈ వారాంతానికి, లేదంటే ఆగస్టు 3 నాటికి డెలివరీ చేస్తాం” అని ప్రకటించారు. మరోవైపు 12జీబీ, 256జీబీ మోడల్ ప్రత్యేక విక్రయాలు (ప్రీ ఆర్డర్) జులై 27న మధ్యాహ్నం ఫ్లిప్ కార్టులో ప్రారంభం కానున్నాయని సంస్థ ప్రకటించింది.
వన్‌ప్లస్ మాజీ వ్యవస్థాపకుడు కార్ల్ పీ నెలకొల్పిన నథింగ్ కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్‌గా నథింగ్ ఫోన్ 1 మొబైల్ మార్కెట్లో పెను సంచలనాలకు నాంది పలికేలా అడుగుపెట్టింది. ఫుల్ హెచ్‌డీప్లస్, ఓఎల్ఈడీ డిస్ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌తో నథింగ్ ఫోన్ 1 కస్టమర్ల ముందుకు వచ్చింది. వైర్డ్, వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ట్రాన్స్ప్రరెంట్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు గ్లిఫ్ ఇంటర్ఫేస్తో కూడిన ఎల్ఈడీ లైట్స్ స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంటుంది. నోటిఫికేషన్లు, బ్యాటరీ ఇండికేటర్, కాల్స్ అలర్ట్‌లకు ప్రత్యేకమైన లైటింగ్ ప్యాటర్న్ మరో క్రేజీ ఫీచర్‌గా నిలవనుంది. మూడు వేరియంట్లలో నథింగ్ ఫోన్ 1 అందుబాటులోకి వచ్చింది.
ఇదీ చదవండి: Nothing Phone (1): ఇంత హైప్ వచ్చిన నథింగ్ ఫోన్ లో సమస్యలు ఇవే..!
ఇదీ చదవండి: మీ ఫోన్ నథింగ్ ఫోన్ లా కనిపించాలంటే.. ఇలా చేయండి!