ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సంబంధాలు తప్పని తెలిసినా.. వీటి వల్ల కళ్ల ముందే కుటుంబాలు నాశనమవుతున్నా కూడా జనాలు.. ఇలాంటి సంబంధాల వైపు మొగ్గు చూపుతునూ ఉన్నారు. ఆడ, మగా అనే తేడా లేదు.. వయసుతో కూడా సంబంధం లేకుండా పోతుంది. ఈ అనైతిక బంధాల మోజులో పడి హత్యలు చేస్తున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరి కొందరు బంగారం లాంటి కుటుంబాన్ని వదిలి పెట్టి వెళ్లి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన రాజస్తాన్‌లో చోటు చేటుచేసుకుంది. పెళ్లై.. ఎనిమిది మంది పిల్లలకు జన్మనివ్వడమే కాన.. వీరిలో ముగ్గురికి వివాహం కూడా అయిన తర్వాత ఓ మహిళకు ఆమె సంసారం నచ్చలేదు. దాంతో 57 ఏళ్ల వయసున్న ప్రియుడితో వెళ్లిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే.. అతడికి నలుగురు సంతానం. వారికి వివాహం అయ్యి.. పిల్లలు పుట్టి.. వాళ్లకు కూడా పెళ్లిల్లు అయ్యాయి. ఆ వివరాలు..
రాజస్తాన్ భరత్‌పుర్ సమీపంలోని నీమల గ్రామానికి చెందిన ఓ మహిళకు కొన్ని ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. 8 మంది పిల్లలు కూడా జన్మించారు. వీరిలో ముగ్గురికి వివాహం అయ్యింది. ఈ క్రమంలో సదరు మహిళకు వీరి ఇంటికి సమీపంగా ఉండే 57 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. గత ఆరేళ్ల నుంచి వీరి మధ్య ఈ ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సదరు వివాహిత.. తన ప్రియుడితో కలిసి గ్రామం నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో వివాహిత భర్త.. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి.. తాయత్తు ఇచ్చి.. తన భార్యను లోబర్చుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. లవర్స్‌ని వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం సదరు మహిళను తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు.
విచారణ సందర్భంగా సదరు మహిళ.. తాను స్వచ్ఛందంగానే తన ప్రియుడితో వెళ్లిపోయానని.. దీనిలో ఎవరి బలవంతం లేదని స్పష్టం చేసింది. అంతేకాక తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపింది. భర్త, పిల్లల వద్దకు తిరిగి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. దాంతో చేసేదేంలేక పోలీసులు ఆమె భర్తకు సర్ది చెప్పి.. ఇంటికి పంపించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.