కులాంతర వివాహాలు చేసుకునే వారిని ఎంకరేజ్ చేయాలని ఓ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వారికి నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. మిగిలిన వివరాలు..
ప్రేమ పెళ్లిళ్లు ఈ మధ్య సర్వసాధారణంగా మారిపోయాయి. లవ్ చేసుకున్న వారు మేజర్లు అయితే వారి పెళ్లిని ఆపడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే పెద్దలను ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడం అంత సులువు కాదు. పెళ్లి విషయంలో మన సమాజంలో ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. ఒకే కులం వారిని పెళ్లి చేసుకోవడం అనే ఆచారం ఎన్నేళ్లుగానో వస్తోంది. ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగుతోంది. ఒకవేళ ఎవరైనా యువతీయువకులు తమ కులం వారిని ప్రేమించుకుంటే.. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకునేందుకు కొంత ఆస్కారం ఉంటుంది. ఇలాంటి పెళ్లిళ్లను ఎన్నో చూసుంటారు కూడా. కానీ ఇతర కులస్తులను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిని హత్యలు చేసిన ఘటనలను కూడా వార్తల్లో చూస్తున్నాం.
కులాంతర వివాహాలు చేసుకున్న వారిని హత్య చేసిన ఘటనలను పరువు హత్యలుగా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులాంతర వివాహం చేసుకునే వారిని ఎంకరేంజ్ చేయాలని డిసైడ్ అయింది. కులాంతర వివాహం చేసుకున్న వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది రాజస్థాన్ ప్రభుత్వం. ఈ మేరకు 2023–24 బడ్జెట్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ప్రకటన చేశారు. తాజాగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ స్కీమ్ ద్వారా రూ.5 లక్షలు 8 ఏళ్లపాటు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో, మిగిలిన రూ.5 లక్షలు దంపతుల ఉమ్మడి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. గెహ్లాట్ సర్కారు తీసుకొచ్చిన ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Effective immediately, inter-caste couples tying the knot will now receive Rs 10 lakhs, up from the previous incentive of Rs 5 lakhs.https://t.co/Vl4MDkk3id
— Economic Times (@EconomicTimes) March 24, 2023