పొరపాటున గతేడాది బడ్జెట్ ప్రతులను ఈ ఏడాది చదివి వినిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. అసెంబ్లీలో రచ్చ.. రచ్చ చేసిన ప్రతిపక్ష సభ్యులు.
బడ్జెట్.. ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంత మొత్తంలో ఆదాయం రావొచ్చు.. ఇంత మొత్తంలో ఖర్చులు ఉండొచ్చని లెక్కలు వేయడాన్నే బడ్జెట్ అని చెపొచ్చు. కేంద్రానికి, రాష్ట్రాలకు వేరువేరు బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయొచ్చు. అందుకే బడ్జెట్‌కు అంత అధిక ప్రాధాన్యం ఉంటుంది. అయితే.. అలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోయి ఓ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నలుగురిలో నవ్వులు పాలయ్యాడు. ఇంతకీ ఏం చేశాడంటారా! గతేడాది బడ్జెట్ ప్రతులను ఈ ఏడాది చదివి వినిపించారు. ఇది గమనించిన విపక్ష సభ్యులు అసెంబ్లీలో గోల గోల చేశారు.
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో రాష్ట్రాలు ఒక్కొక్కటిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. నేడు(శుక్రవారం) బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ ప్రతులను చదువుతూ ముందుకు సాగారు. ఇలా ఏడు నిమిషాల పాటు కొనసాగించారు. అయితే.. ప్రతిపక్ష సభ్యులు గోల గోల చేయడంతో అసలు విషయం ఆయనకు అర్ధమై బడ్జెట్ చదవడం ఆపేశారు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అవకాశం దొరికితే ఒక్కాట ఆడుకునే ప్రతిపక్ష నాయకులకు ఇంతటి తప్పిదం ఏకంగా సీఎమ్మే చేస్తే ఊరుకుంటారా! అసెంబ్లీలో రచ్చ.. రచ్చ చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా, అసెంబ్లీ వేదికగా ఎగతాళి చేశారు. ఈ గందరగోళం నడుమ సభ అరగంట పాటు వాయిదా వేశారు. మొత్తానికి ఈ వార్త నెట్టింట చేరడంతో దేశమంతా పాకింది.
అనంతరం మళ్లీ సభ సమావేశం పునఃప్రారంభం కాగానే అశోక్ గెహ్లాట్ వివరణ ఇచ్చారు. తాను గత బడ్జెట్ పాత పత్రాలను చూసుకునేందుకు తెచ్చానన్నారు. పొరపాటున గత బడ్జెట్‌కు సంబంధించిన అదనపు ప్రతి కలిసిందని, చూసుకోకుండా అది చదివినందుకు క్షమించాలని కోరారు. అయినా బీజేపీ ఎమ్మెల్యేలు గోల చేయడంతో.. సభ్యులందరికీ ఇచ్చిన బడ్జెట్ ప్రతులు, ప్రస్తుతం తన చేతిలో ఉన్న బడ్జెట్ ఒక్కటే అయినప్పుడు బడ్జెట్ పత్రాలు లీకయ్యాయనండంలో అర్థం లేదన్నారు. సాధారణంగా బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. అశోక్ గెహ్లాట్ ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకోవడంతో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. దేశంలో ఇలాంటి సంఘటన చేసుకోవడం ఇదే మొదటసారి అని తెలుస్తోంది. ఈ విధంగానైనా రాజస్థాన్ ముఖ్యమంత్రి అరుదైన ఘనత సాధించాడనే చెప్పుకోవాలి. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rajasthan CM Ashok Gehlot ends up reading last year’s Budget in the Assembly.🤦♂️😂 pic.twitter.com/sW0oxQ8SNi
— Rishi Bagree (@rishibagree) February 10, 2023
Nirmala ji trolls Ashok Gehlot.
pic.twitter.com/L4hzHxv10D— Sachin (@Sachin54620442) February 10, 2023