దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో ఎంతో మంది నిరుద్యోగులుగా మారారు.. ఎన్నో కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఇలాంటి సమయంలో కొంత మంది మానవత్వం చాటుకొని ఎంతో మంది పేద ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. అభినవ దానకర్ణుడుగా పేరు తెచ్చుకున్నారు.
సోనూ సూద్ బాటలోనే కొంద మంది నటీ.. నటులు తమ సేవ కొనసాగిస్తున్నారు. భారతీయ చలన చిత్ర రంగంలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ నేను సైతం అంటూ కరోనా కష్ట కాలంలో పేదలకు అండగా నిలిచారు. తాజాగా ప్రకాశ్ రాజ్ ఓ పేద కుటుంబానికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న శ్రీరంగపట్నంలో ఓ కుటుంబం కరోనా కష్టకాలంలో దుర్భరజీవితాన్ని గడుపుతున్నారు. వారి పరిస్థితి తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ తాను స్థాపించిన ‘ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్’ తరపున దీన్ని అందించారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఓ కుటుంబానికి జేసీబీ అందించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటే ఆ ఆనందమే వేరని అన్నారు. ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల బిజీలో ఆయన ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో జీవిత, హేమ కూడా ఉన్నారు.
Empowering a family with a JCB near srirangapatna.. Mysore. a #prakashrajfoundation initiative.. The joy of giving back to life .. bliss pic.twitter.com/Y4r8Qwp1lp
— Prakash Raj (@prakashraaj) September 13, 2021