పవిత్ర. పవిత్ర లోకేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారిన పేర్లలో ఒకటి.ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కన్నడ అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత తెలుగు తెరపైకి తొంగి చూశారు. తాజాగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ముందుకు వచ్చారు.
కొంత మంది వివాదాలతో మనకు గుర్తిండిపోతారు. అటువంటి వారిలో ఒకరు పవిత్ర లోకేశ్. ప్రస్తుతం ఆమె పరిశ్రమలో ఓ సంచలనం. తండ్రి మైసూర్ లోకేశ్ నుండి నటనా వారసత్వాన్ని తీసుకుని చందన సీమలోకి అడుగుపెట్టారు పవిత్ర. పవిత్ర లోకేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారిన పేర్లలో ఒకటి.ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కన్నడ అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత తెలుగు తెరపైకి తొంగి చూశారు. తెలుగులో మంచి సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ దూసుకెళుతున్నారు. అయితే ఆమె పరిశమ్రలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే సీనియర్ నటుడు నరేష్‌తో పరిచయం ఏర్పడి.. అది సహ జీవనంగా మారడం అందరికి తెలిసిందే. వీరి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే మళ్లీ పెళ్లి.
ఈ నెల 26న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ప్రమోషన్లలో ఎక్కడ చూసినా, ఏ టీవీలో కనిపించిన ఈ జంటే. లేటు వయస్సులో ఘాటు ప్రేమలాగా చెట్టాపెట్టాలేసుకుని కనిపిస్తున్నారు. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ.. తామేమీ తప్పు చేయడం లేదని నిరూపించేందకు ప్రయత్నిస్తున్నారు. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నుండి విడాకులు తీసుకోకుండానే.. పవిత్రతో సహజీవనం చేస్తున్న నరేష్.. త్వరలో పవిత్ర లోకేశ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పడం గమనార్హం. అయితే పవిత్ర లోకేశ్‌కు నరేష్ కాకుండా మరో ఇద్దరు హీరోలు ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. ప్రస్తుతం పవిత్ర హాట్ టాపిక్‌గా మారిన తరుణంలో.. ఆమెకు సంబంధిన పలు విషయాలపై నెటిజన్లు శోధిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యలేట్ అవుతుంది. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాథాన్యత సంతరించుకున్నాయి.
తనకు ఇద్దరు హీరోలంటే క్రష్ అని తెలిపింది పవిత్ర లోకేశ్. ‘నేను ఆరు.. ఏడు తరగతిలో ఉండగా నాగార్జున గీతాంజలి మూవీ విడుదలైంది. ఆ సమయంలో ఇలాంటి వాడు భర్తగా రావాలని ఫీలింగ్ వచ్చింది. అప్పడు అతడిపై క్రష్ ఏర్పడింది’ అని చెప్పింది. నాగార్జుననే తన ఫస్ట్ క్రష్ అని పవిత్ర అంగీకరించింది. అదే సమయంలో మరో నటుడు అంటే ఇష్టమేర్పడిందని చెప్పారు. ప్రకాష్ రాజ్ అంటే ఇష్టమని చెప్పింది. ఆయనతో్ చాలా సినిమాలు నటించానని పేర్కొంది నార్మల్ గా ఉండలేక.. దూరంగా ఉంటే.. ఆయన పిలిచి మాట్లాడేవారని చెప్పుకొచ్చారు. ఆయనతో కన్నడలో సినిమాలు చేయలేదని, టాలీవుడ్లో ఇద్దరం నటించామని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.