ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసిన సినిమా అంటే 'రంగమార్తండ'నే. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. మరీ రెండు వారాలు కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ సినిమాలకంటే ఓటీటీల హవా ఎక్కువైపోయింది. కొన్నాళ్లుగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ.. ముందుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాకే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. సినిమాలు ఎంతటి భారీ స్థాయిలో రిలీజైనా.. వాటికి దక్కుతున్న ఆదరణ బట్టే.. ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. కొన్ని సినిమాలు విడుదలైన రెండు మూడు నెలల వరకు ఓటిటిలోకి రావు. కానీ.. కొన్ని సినిమాలు రిలీజైన 3-4 వారాలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలై.. సూపర్ టాక్ సొంతం చేసుకున్న ‘రంగమార్తాండ‘ మూవీ.. ఓటీటీలో రిలీజ్ కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘రంగమార్తాండ’. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా.. మరాఠీ సూపర్ హిట్ ‘నటసామ్రాట్’ మూవీకి అధికారిక రీమేక్. ఉగాది సందర్భంగా మార్చి 22న రంగమార్తాండ.. ఎలాంటి హడావిడి, ప్రమోషన్స్ లేకుండా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. విడుదలైన ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి థియేటర్స్ లో బాగానే ఆదరణ దక్కింది. కానీ కలెక్షన్స్ పెద్దగా రాలేదు. మరీ తక్కువగా రావడంతో ఇప్పుడు రెండు వారాల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చేశారు.
రంగమార్తాండ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కొనుగోలు చేసింది. సినిమా రిలీజైన రెండు వారాలకు అంటే తాజాగా శుక్రవారం సైలెంట్ గా స్ట్రీమింగ్ చేసేసింది. ఇదిలా ఉండగా.. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా బాగుందనే టాక్ అయితే సంపాదించారు కానీ కలెక్షన్స్ మాత్రం వసూలు చేయలేకపోయారు. మరి ఈ హిట్ ట్రాక్ ని ఇకపై కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి. రంగమార్తాండ మూవీకి.. మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. మరి రంగమార్తాండ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Recent Telugu Release #Rangamarthanda is streaming now on AMAZON PRIME. pic.twitter.com/qSsE8y8RlA
— Christopher Kanagaraj (@Chrissuccess) April 7, 2023